సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు చక్కెర్లు కొడుతున్నాయి. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. 

ఇకపోతే ఈ హుజూరునగర్ ఉప ఎన్నిక అంశంలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడే చీలికలు సైతం మెుదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. 

ఉత్తమ్ ని నిత్యం విమర్శించే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూట్ మార్చారరో ఏమో ఏకంగా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్  పద్మావతియేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉందన్న కోమటిరెడ్డి హుజూర్‌నగర్ అభ్యర్థిపై రాద్ధాంతం వద్దని విజ్ఞప్తి చేశారు. 

అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం ఉత్తమ్ పద్మావతిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత పోరుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఎర్రమంజిల్‌పై ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా హైకోర్టు తీర్పు రావడం సంతోషమన్నారు. 

కేసీఆర్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఉత్తమ్ ఆరోపించారు. సీజన్ ముగిసినా 30 శాతంకి మంది రైతుబంధు సాయం అందలేదన్నారు. 56 లక్షల ఇళ్లకు మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయనడం పచ్చి అబద్ధమని విమర్శించారు.  

300 గ్రామాల్లో కనీసం 10 రోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఇసుక దందా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జగదీష్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 

ఈ వార్తలు కూడా చదవండి

రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో చుక్కలు: ఉత్తమ్ కు బాసట

కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్