హైదరాబాద్: హుజూర్ నగర్ అసెంబ్లీ  స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై  కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో చర్చ జరిగింది. ఈ విషయమై చర్చ జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని  కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని బరిలోకి దింపనున్నట్టు ప్రకటించారు.ఈ విషయమై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై  షాకాజ్ నోటీసు ఇవ్వాలని కూడ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలను ఎఐసీసీకి నివేదించింది. రేవంత్ రెడ్డిపై చర్యల విషయమై ఎఐసీసీ అనుమతి కోసం కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఎదురు చూస్తోంది.

హూజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి పేరును ఏకపక్షంగా ప్రకటించారని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉంటే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రేవంత్ వైఖరిని తప్పుబట్టారు.

సంబంధిత వార్తలు

కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్