కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు

First Published 20, Sep 2019, 8:50 AM

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం  ఆ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి హూజూర్ నగర్ అభ్యర్ది ఎంపిక విషయంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి విషయమై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్టుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా గురువారం నాడు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో కూడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడ కమిటీ చర్చించినట్టుగా సమాచారం.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల చేశారు.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పద్మావతి పోటీ చేస్తారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పార్టీలో కొందరు నేతలు కూడ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు సమావేశమై హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

పార్టీలో కొత్తగా వచ్చిన వారి సలహాలు అవసరం లేదని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాను ఒక్కటైనట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో తమ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసిన సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇదంతా ఏమీ లేదని కుంతియా ఆ సమయంలో కొట్టిపారేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే తాము చర్చించినట్టుగా కుంతియా  వివరణ ఇచ్చారు. సోనియాగాంధీతో తన కుటుంబసభ్యులతో రేవంత్ రెడ్డి భేటీ కావడం కూడ ఆ సమయంలో పార్టీలో చర్చ జరిగింది.

పీసీసీ చీఫ్ పదవి తనకు రాకుండా  ఉత్తమ్ తో పాటు కొందరు అడ్డుపడినందునే రేవంత్ హుజూర్ నగర్ విషయంలో వేలు పెట్టాడా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.