నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, కేరళలోని పాల, త్రిపురలోని భాదర్‌ఘాట్ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అయితే తెలంగాణలో హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు మాత్రం ఈసీ నోటీఫికేషన్ జారీ చేయలేదు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికవ్వడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

హుజూర్‌నగర్‌లో గెలిచి ఉత్తమ్‌కు షాకివ్వాలని టీఆర్ఎస్... సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ మంచి పట్టుదలగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికకు నోటీఫికేషన్ వెలువడకపోవడంతో ఇరుపక్షాలు డీలా పడ్డాయి.