హైదరాబాద్: హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో నిలిపే అభ్యర్ధి విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు  సరికాదని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు.

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో వి. హనుమంతరావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నల్గొండ జిల్లా నేతలంతా ఏకమయ్యారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అని ఆయన చెప్పారు.  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరు పోటీ చేస్తారో చెప్పే హక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డికి  ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపే విషయమై కోర్ కమిటీ చర్చ జరిగిన సమయంలో  రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదరపలేదని ఆయన ప్రశ్నించారు. హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు దఫాలు విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ బృందం పర్యటించిన సమయంలో రేవంత్ రెడ్డి ఏం చేశాడో మీరంతా చూశారని ఆయన గుర్తు చేశారు.కోడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ స్థానంలో పోటీ చేస్తే  తాము అభ్యంతరం చెప్పని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ వేదికలపై రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

అఖిలపక్ష సమావేశానికి పవన్‌ కల్యాణ్ వెళ్తే తప్పేంటని ఆయన  ప్రశ్నించారు. యురేనియంలో ఏబీసీడీలు తెలియవని సంపత్‌ను రేవంత్‌రెడ్డి అవమానించడం సరైంది కాదన్నారు..రేవంత్‌ చాలా జూనియర్‌, స్పీడ్‌ ఎక్కువుంది, తగ్గించుకోవాలని ఆయన సూచించారు. రేవంత్‌రెడ్డి స్టైల్ ప్రాంతీయ పార్టీల్లో నడుస్తుంది కానీ, కాంగ్రెస్‌లో నడవదన్నారు.
 

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ బై ఎలక్షన్ ట్విస్ట్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు ఎంపీ కోమటిరెడ్డి మద్దతు

రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో చుక్కలు: ఉత్తమ్ కు బాసట

కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు
ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్