తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్ని ప్రచార వేగాన్ని పెంచాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షులు రాహుల్ గాంధీ ఇవాళ కొడంగల్ లో ఎన్నకల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి పార్టీలపై విరుచుకుపడ్డారు. 

5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలు ఓ కొత్త స్వప్నంతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని రాహుల్ గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో మొదట టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందని...కేసీఆర్ తమ స్వప్నాన్ని నెరవేరుస్తాడని నమ్మి ప్రజలు సీఎం చేశారన్నారు. కానీ ఆయన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజల కలల్ని కల్లలు చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. 

ఇక్కడ సభాప్రాంగణంలో వీస్తున్న గాలి(హవా) వల్ల కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతోందని....అయితే ఇది సాధారణమైన గాలి కాదని అన్నారు. ఈ హవాతోనే రేపు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గద్దె దించనుందని రాహుల్ అన్నారు.  

నూతన రాష్ట్రం తెలంగాణలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో 17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. కానీ ఐదేళ్ల టీఆర్ఎస్ పాలన తర్వాత ధనిక  రాష్ట్రం కాస్త అప్పులపాలయ్యిందన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కొడుకు(కేటీఆర్) ఆదాయం 400 శాతం పెరిగిందని రాహుల్ ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులనే రీడైజైనింగ్ పేరుతో కేసీఆర్ కేవలం పేర్లు మార్చిందన్నారు. కానీ రూ. 50వేల కోట్ల తో నిర్మించాలనుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం గా పేరు మార్చిరూ. 80 వేల కోట్లకు పెంచారన్నారు. కేవలం పేరు మార్చడం ద్వారా రూ.30 కోట్లు దండుకున్నారని రాహుల్ విమర్శించారు. ఇక  
మిషన్ భగీరథ ట్యాంకులకు పెయింట్ వేయడానికి వేల కోట్ల డబ్బులు ఖర్చయినట్లు చూపిస్తున్నారన్నారు. ఈ డబ్బంతా తెలంగాణ, యువకులకు రైతులకు మోసం చేసింది కాదా అని ప్రశ్నించారు.

గత ఎన్నికల సమయంలో లక్ష ఉద్యోగాల ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు కదా.... 4 సంవత్సరాలలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. యువకులకు  ఉద్యోగాలివ్వకున్నా తన కుటుంబంలో 4గురికి మాత్రం ఉద్యోగాలిచ్చారన్నారు. ఈ నలుగురే 4 కోట్ల ప్రజల అవకాశాలను లాక్కున్నారని రాహుల్ విమర్శించారు. 

కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. నిరుపేదలకు  22 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని...ఐదేళ్లలో కేవలం  ఐదు వేల ఇళ్లు కూడా కట్టలేడన్నారు.  దళిత,గిరిజనులకు భూమి ఇస్తానని మోసం చేశాడన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు, భూమి ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి తీసుకుంటారన్నారు. అలాగే నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, 1 లక్ష యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలిస్తామని, పేదల వైద్యానికి 5 లక్షలతో ఉచిత వైద్య సదుపాయం అందించే ఏర్పాటు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

 డిల్లీలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ప్రజల్ని దగా చేస్తున్నారని రాహుల్ విమర్శించారు. పార్లమెంట్ లో ప్రతి బిల్లు సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రాష్టీయ సంఘ్ పరివార్ అని రాహుల్ ఎద్దేవా చేశారు.

ఎంఐఎం, టీఆర్ఎస్ లు కేంద్రంలో బిజెపిని గద్దె దించాలనే కాంగ్రెస్ లక్ష్యాన్ని నెరవేర్చనియ్యడం లేదని రాహుల్ ఆరోపించారు. నిజంగా కేసీఆర్ తెలంగాణ వాది అయితే మోదీకి సపోర్టు చేయరని అన్నారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రధానిని చేయడమే టీఆర్ఎస్ ఎజెండా అని రాహుల్ పేర్కొన్నారు. అందువల్ల మొదట కేసీఆర్ ను ఓడించి... 2019 లో జాతీయ స్థాయిలో మోదీని ఓడిస్తామని రాహుల్ అన్నారు.

మరిన్ని వార్తలు

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై