హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  యూపీఏ  ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కీలకంగా వ్యవహరించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  గతంలో  జరిగిన ఎన్నికల సభల్లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని  సోనియా హమీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల పొత్తును పెట్టుకొన్నాయి. ఆ ఎన్నికల్లో  టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  వైఎస్ఆర్  రెండో దఫా ముఖ్యమంత్రిగా అయ్యారు.వైఎస్ఆర్ మరణం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం   కేసీఆర్  అమరణ నిరహరదీక్ష ప్రారంభించారు.

ఈ ఆమరణ నిరహార దీక్షతో ఆనాడు  అధికారంలో ఉన్న  యూపీఏ ప్రభుత్వం   తెలంగాణ రాష్ట్రం ఇస్తామని  ప్రకటించింది. 2014 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో బిల్లు  ఆమోదించింది.ఆనాడూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో  సోనియా గాంధీ కీలక పాత్ర పోషించింది.మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను  ఒప్పించింది సోనియా.

తెలంగాణ రాష్ట్రాన్ని  ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను  మరవలేమని  కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా కీలకంగా వ్యవహరించిందనే  సెంటిమెంట్ ఉన్నందున   ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రచారానికి తెలంగాణ నేతలు ఒప్పించారు. మేడ్చల్  లో జరిగే  కాంగ్రెస్ సభలో  సోనియా గాంధీ పాల్గొంటున్నారు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో జరిగే సభలో తొలిసారిగా  సోనియా పాల్గొంటున్నారు. గతంలో తాను ఇచ్చిన  మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు సోనియాగాంధీ  గుర్తు చేసే అవకాశం ఉంది. 

 తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయాన్ని సోనియా గుర్తు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో  కాంగ్రెస్ నేతలు  సోనియాతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

 సంబంధిత వార్తలు

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై