హైదరాబాద్: ప్రజా కూటమిని గెలిపించాలనే వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ ఇబ్రాహీంపట్నం అభ్యర్థి రంగారెడ్డికి షాక్ ఇచ్చారు. ఆశించిన ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వకుండా సామ రంగారెడ్డికి తొలి షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆదివారంనాడు మరో షాక్ ఇచ్చింది. 
ఇబ్రహీంపట్నం టికెట్ సామ రంగారెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, సామ రంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఉపసంహరించుకుంది. చంద్రబాబు నిర్ణయంలో భాగంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నం టికెట్ తనకు కావాలని కోరడానికి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీపీ నేత రొక్కం భీంరెడ్డి కలిశారు.  37ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని ఆయన చంద్రబాబుకు వివరించారు. అయితే, సామ రంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్మక్కయ్యారని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఆ విషయాన్ని పార్టీ శ్రేణులకు చేరవేసింది.

చంద్రబాబుతో కాంగ్రెసు నేతలు జరిపిన మంతనాల తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది. కూటమి విజయమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డికి షాక్ ఇవ్వడానికి వెనకాడలేదని అంటున్నారు. 

ఈ స్థితిలో ఇబ్రహీంపట్నం బీఫాం‌మ్‌ కోసం సామా రంగారెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు రంగారెడ్డి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉన్నారు. అయితే తనకు బీ ఫామ్‌ ఇవ్వకపోవడంతో ఆయన వెనుదిగారు. 

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 12 మంది అభ్యర్థులకు టీటీడీపీ బీఫామ్స్‌ అందజేసిన విషయం తెలిసిందే. భీపామ్ అందుకున్న నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామా రంగారెడ్డి కూడా ఉన్నారు. అయితే,  ఆయనకు బీ ఫామ్ మాత్రం దక్కలేదు. 

సంబంధిత వార్తలు

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

తీవ్ర అసంతృప్తి: సామకు బాబు బుజ్జగింపులు, తప్పని రెబెల్ బెడద

అమరావతిలో ఎల్‌బి నగర్ పంచాయతీ.. బాబుతో సామ భేటీ

టీ టీడీపీ రెండో జాబితా విడుదల

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను తాకిన అసంతృప్తి జ్వాల, కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...