Asianet News TeluguAsianet News Telugu

సీన్ రివర్స్: 'చెయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి ఉద్యమ కాలంలో చేదోడు వాదోడుగా నిలిచిన ప్రజా సంఘాల నేతలు ఎన్నికల రణరంగంలో  ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

social activits supports to  congress in telangana elections
Author
Hyderabad, First Published Nov 23, 2018, 6:43 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి ఉద్యమ కాలంలో చేదోడు వాదోడుగా నిలిచిన ప్రజా సంఘాల నేతలు ఎన్నికల రణరంగంలో  ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే బలమైన శక్తిగా ఆవిర్భవించిన మహాకూటమి కోసం  పనిచేస్తున్నారు. ఉద్యమ అవసరాల రీత్యా  కేసీఆర్ తీరుపై  సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం చేయడానికి కాంగ్రెస్ తీసుకొన్న  చర్యలకు  మద్దతుగానే  ఇప్పుడు అటువైపు అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న ప్రజా సంఘాల నేతలు మేడ్చల్‌లో శుక్రవారం నాడు నిర్వహించిన సభలో  పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ,  గద్దర్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్‌తో పాటు జేఎసీ,  మందకృష్ణ మాదిగ, గద్దర్, విమలక్కతో పాటు పలు ప్రజా సంఘాలనేతలు పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  రాష్ట్రంలో  రాజకీయ సమీకరణాల్లో మార్పులు  చోటు చేసుకొన్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టీజేఎసీ కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన  విధానాలను  నిశితంగా  విమర్శించింది. కేసీఆర్ పై  కూడ జేఎసీ విమర్శలు చేసింది. 

దీంతో  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందున జేఎసీ అవసరం లేదని జేఎసీలో ఉన్న కొన్ని ప్రజా సంఘాలు బయటకు వచ్చాయి.  జేఏసీని విచ్ఛిన్నం చేయడంలో  కేసీఆర్ కీలకంగా వ్యవహరించారని జేఏసీ నేతలకు కోపం ఉంది.  

దీంతో జేఏసీ రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేసింది.ఈ పార్టీకి  కోదండరామ్ అధ్యక్షుడుగా ఉన్నాడు. జేఏసీ ప్రజా సంఘంగా  కొనసాగుతోంది. 

మరోవైపు తెలంగాణ ఉద్యమంలో  కీలకంగా వ్యవహరించిన మందకృష్ణ మాదిగ కూడ టీఆర్ఎస్ విధానాలపై  బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎస్సీలకు ఎబీసీడీ వర్గీకరణ విషయమై ఆందోళన నిర్వహించిన సందర్భంగా  మందకృష్ణను టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.ఈ పరిణామంతో  కేసీఆర్ తీరుపై  మందకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజా యుద్ద నౌక గద్దర్ కూడ కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. కేసీఆర్  పాలన తీరును రాజరికపు పాలనగా గద్దర్ విమర్శ చేశారు. కొంత కాలంగా  టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  గద్దర్ ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గద్దర్ కొడుకు సూర్యం ఇటీవలనే  కాంగ్రెస్ పార్టీలోనే చేరారు.

జనశక్తి నేత అమర్ సతీమణి విమలక్కకు   కూడ కేసీఆర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.  కేసీఆర్‌ను వ్యతిరేకించే ప్రజా సంఘాల నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు.

గతంలో ఈ ప్రజా సంఘాల నేతలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ అనుసరించిన విధానాలపై వీరంతా  బహిరంగంగానే  విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ తో రాజకీయంగా విబేధించిన కాంగ్రెస్,టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కూడ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి ఈ ప్రజా సంఘాల నేతలు కూడ మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో   సీపీఐ కూడ కీలకంగా వ్యవహరించింది. కానీ, ప్రస్తుతం సీపీఐ  ప్రజా కూటమిలో  భాగస్వామిగా ఉంది.

కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్న పార్టీలను  ఏకం చేయడంలో  టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరించింది. తెలంగాణలో తమను దెబ్బతీసిన కేసీఆర్ ను రాజకీయగా దెబ్బతీసేందుకు  టీడీపీ ప్రజా కూటమిని తెరమీదికి తెచ్చింది.

సంబంధిత వార్తలు

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై

 

Follow Us:
Download App:
  • android
  • ios