తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చెప్పినట్లు  టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి సంచనల ప్రకటన చేశారు. కేవలం టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరతారంటూ మరో బాంబు పేల్చారు. ఈ ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

ఇక నిన్న(బుధవారం) కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ రేవంత్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ పై స్పందించిన రేవంత్... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా 100 సీట్లు రాకపోతే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారని గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్ కు 99 సీట్లే వచ్చాయని అయినా కేటీఆర్ ఇంకా సన్యాసం తీసుకోకుండా రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ లకు పిచ్చిపట్టి రాష్ట్రమంతా తిరుగుతున్నారని...ఓడిపోయేవాళ్లకే మాటలు ఎక్కువగా వస్తాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చొచ్చని రేవంత్ సూచించారు. 

తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకుంటాడని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారని....ఒకవేళ చంద్రబాబు ఆపాలనుకున్నా ఆపడం సాధ్యం కాదని రేవంత్ అన్నారు. మన కింద రాష్ట్రం మనకు నీళ్లు ఆపే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ నాయకులు గుర్తిస్తే బావుంటుందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డాడా...లేదా 12 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్నాడా అని రేవంత్ ప్రశ్నించారు. 

రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం, కేసీఆర్ వైపల్యాల గురించి ఆమె వివరిస్తారని...అలాగే రాబోయే ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తుందో చెబుతారన్నారు. 

మరిన్ని వార్తలు

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?