తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టికెట్ దక్కని కాంగ్రెస్ అభ్యర్థులు ... పార్టీపై అసంతృప్తితో రెబల్‌గా పోటీ చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్ నేత తోటకూర జంగయ్య యాదవ్ మేడ్చల్ స్థానంలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది.

పరిస్థితి చేయిదాటకుండా... మరింత మంది రెబల్‌గా నామినేషన్ వేయకుండా ఉండేందుకు గాను బుజ్జగింపులకు దిగింది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్..జంగయ్య యాదవ్ వద్దకు వెళ్లి బుజ్జిగించారు. ఆయన వెంట మాగం రంగారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దమర్రి నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు.

పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నామినేషన్ ఉపసంహరించుకోవాలని.. అధికారంలోకి వచ్చాకా సముచిత స్థానం కల్పిస్తామని జైరాం రమేశ్.. హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ ఇంటికి కూడా రమేశ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.     

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై