హైదరాబాద్:  ఒక తల్లి ఏళ్ల తరబడి తర్వాతా తమ స్వంత బిడ్డల వద్దకు వస్తే ఎలా ఆనందం వస్తోందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఇక్కడకు వచ్చిన తర్వాత తాను చాలా ఆనంద పడుతున్నట్టు  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  చెప్పారు.

శుక్రవారం నాడు మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ  పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన సోనియా గాంధీకి  పౌరసన్మానం నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.తెలంగాణరాష్ట్ర ఏర్పాటు చాలా సులువు కాదనిపించింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం  చాలా ఇబ్బంది పడినట్టు ఆమె చెప్పారు.

రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని  ఆనాడు భావించినట్టు సోనియా గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ బిల్లు పెట్టిన రోజే  ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినట్టు ఆమె ప్రస్తావించారు.

కాంగ్రెస్ కు నష్టమని తెలిసి కూడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు సోనియా చెప్పారు.  తెలంగాణ ఉద్యమ స్పూర్తిని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తనను  చాలా బాధకు గురిచేస్తున్నాయని చెప్పారు. రాజకీయంగా నష్టం జరిగినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆమె గుర్తు చేశారు.

నీళ్ళు,నిధులు,నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాల్లో ఒక్కటైనా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారని సోనియా చెప్పారు.

నాలుగున్నర టీఆర్ఎస్ పాలనలో  ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు.తాము తెచ్చిన భూసేకరణ చట్టాన్ని కేసీఆర్ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మీరు కన్న కలలు సాకారమయ్యాయా  అని ఆమె ప్రశ్నించారు.

ఈ ప్రాంతంలోని  మహిళా సంఘాల గురించి తాను  ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ చెప్పేదాణ్ణని చెప్పారు.కేసీఆర్ పాలనలో మహిళా సంఘాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  ఇప్పటీకీ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని  ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మాత్రమే బాగుపడ్డారని సోనియా విమర్శించారు. పేదల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగులంతా నిరాశా నిస్ఫృహల్లో ఉన్నారు. 

పిల్లల పెంపకం సరిగా లేకపోతే  ఆ పిల్లలు ఎలా నాశనమౌతారో... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు.

మాటమీద నిలబడనివారిని ప్రజలు నమ్మొద్దని సోనియాగాంధీ కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు ముడిపడి ఉన్నాయన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం  మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు. భారీ మెజారిటీతో  ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

 

సంబంధిత వార్తలు

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై