Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

అర్హత ఉండి డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ధరఖాస్తు చేసుకొన్న వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  రెంట్ రీ ఎంబర్స్ మెంట్ కింద రూ.50వేలను వన్ టైమ్ గ్రాంట్‌గా ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు

we will ban cps scheme says Uttam kumar reddy
Author
Hyderabad, First Published Nov 23, 2018, 1:03 PM IST


హైదరాబాద్: అర్హత ఉండి డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ధరఖాస్తు చేసుకొన్న వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  రెంట్ రీ ఎంబర్స్ మెంట్ కింద రూ.50వేలను వన్ టైమ్ గ్రాంట్‌గా ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరాల జల్లు ప్రకటించారు. 

శుక్రవారం నాడు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.   పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే   డబుల్ బెడ్ రూమ్  ఇళ్లకు ధరఖాస్తు చేసుకొని కూడ  ఇళ్లు  పొందని అర్హులకు ఒకే సారి రూ.50 వేలను గ్రాంట్ గా ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  15 రోజుల్లోనే  ఈ విషయాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. 

హైద్రాబాద్‌తో పాటు  రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో డబెల్ బెడ్‌రూమ్  ఇళ్లను  నిర్మాణం కోసం   ధరఖాస్తు చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రభుత్వం ఇంతవరకు  ఈ ఇళ్లను  ఇంకా పూర్తి చేయలేదన్నారు. ఏడాది క్రితం హైద్రాబాద్ చుట్టుపక్కల లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  నిర్మిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు లక్షన్నర ఇళ్లను నిర్మించనున్నట్టు  చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

డబుల్ బెడ్ రూమ్  ఇళ్ల కోసం  అర్హత ఉండి ఇబ్బంది పడుతున్నవారికి రెంట్ రీఎంబర్స్ మెంట్ ను  ఇస్తామన్నారు. ఈ పథకానికి మా ఇంటి వెలుగు పథకంగా నామకరణం చేసినట్టు  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ఉపాధి హామీ పథకం కింద అందరూ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇస్తామని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని  ఉత్తమ్ ప్రకటించారు.పాత పెన్షన్  విధానాన్ని అమలు చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ విషయంలో ఏడాదిపాటు కేసీఆర్  నాన్చివేత ధోరణిని అవలంభించారని  ఉత్తమ్ విమర్శించారు. పీపుల్స్ ప్రంట్  అధికారంలోకి రాగానే 15 రోజుల్లో ఐఆర్ ను విడుదల చేస్తామన్నారు. పీఆర్సీని  కూడ ఫైనల్ చేస్తామని  ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

రెబల్స్‌ను బుజ్జగించేందుకు రంగంలోకి జైరాం రమేశ్

సామ రంగారెడ్డికి చంద్రబాబు షాక్: 12 సీట్లకే టీడీపి పరిమితం

టీడీపీకి షాక్: ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డికి కాంగ్రెస్ మద్దతు

రంగంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు: రెబెల్స్‌కు బుజ్జగింపులు

చంద్రబాబుతో తెలంగాణకు ప్రమాదం: కేసీఆర్

లగడపాటికి భలే గిరాకీ: వ్యక్తులపై నో, తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వేకే సై

Follow Us:
Download App:
  • android
  • ios