హైదరాబాద్: టీడీపీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానంలో రెబెల్స్  అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికే మద్దతు ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. 

ఇబ్రహీంపట్నం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. ఈ స్థానం నుండి  సామ రంగారెడ్డికి టీడీపికి కేటాయించింది. ఎల్బీ నగర్ సీటును సామ రంగారెడ్డి ఆశించారు. కానీ, ఇబ్రహీంపట్నం టికెట్టు దక్కింది. దీంతో  ఈ స్థానం నుండి తొలుత పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి ఆసక్తి చూపలేదు.

ఈ నేపథ్యంలో  సామ రంగారెడ్డికి ఆలస్యంగా టీడీపీ బీ ఫారాన్ని ఇచ్చింది.అయితే టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి  టీఆర్ఎస్ అభ్యర్థితో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మల్ రెడ్డి రంగారెడ్డి కూడ ఇబ్రహీంపట్నం స్థానం నుండి బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డి  నామినేషన్ దాఖలు చేశారు.

బుధవారం నాడు  రాత్రి పూట టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనేతలు మల్‌రెడ్డి రంగారెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి కాకుండా మల్‌రెడ్డి రంగారెడ్డికే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకొంది.  ఈ  మేరకు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులకు సమాచారాన్ని పంపింది.

కాంగ్రెస్ పార్టీ బీ ఫారాన్ని ఇవ్వలేకపోయినందున.... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మల్‌రెడ్డికి సహకరించాలని ఉత్తమ్ ఆదేశించారు.

అయిష్టంగానే ఇబ్రహీంపట్నం స్థానం నుండి  టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సామ రంగారెడ్డి ఇప్పుడు ఏం చేస్తారోననే ఆసక్తి  సర్వత్రా నెలకొంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీడీపీ 14 స్థానాలను  కేటాయించినా రెబెల్స్‌తో పాటు ఇతర కారణాలతో టీడీపీ 13 స్థానాల్లోనే  పోటీ చేయాలనే నిర్ణయం తీసుకొంది. 

 ఈ 13 స్థానాల్లోని ఇబ్రహీంపట్నం స్థానం  కూడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతు ఇవ్వాలని  నిర్ణయం తీసుకోవడంతో  టీడీపీ అధినాయకత్వం ఏం చేస్తోందో చూడాలి.

సంబంధిత వార్తలు

తీవ్ర అసంతృప్తి: సామకు బాబు బుజ్జగింపులు, తప్పని రెబెల్ బెడద

అమరావతిలో ఎల్‌బి నగర్ పంచాయతీ.. బాబుతో సామ భేటీ

టీ టీడీపీ రెండో జాబితా విడుదల

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను తాకిన అసంతృప్తి జ్వాల, కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

బరిలో రేవూరి: కీలక నిర్ణయం దిశగా నాయిని, ఆ పార్టీకి షాకేనా...