Asianet News TeluguAsianet News Telugu

Survey report : 54% భారతీయులు అందులోని సమాచారం నిజమని నమ్ముతున్నారట తెలుసా..

ఈ నివేదిక ప్రకారం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల సోషల్ మీడియా యూజర్లు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన సమాచారం నిజమని నమ్ముతున్నారట. 

Survey report says 54% of Indians use social media for factual information
Author
Hyderabad, First Published Jun 30, 2022, 12:26 PM IST

సోషల్ మీడియాలో కనిపించే సమాచారం ఫేక్ న్యూస్ అని చెబుతున్నా, ఓ సర్వే మాత్రం ఆ భావన తప్పని నిరూపించింది. 54 శాతం మంది భారతీయులు వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నివేదిక పేర్కొంది. ది మేటర్ ఆఫ్ ఫాక్ట్ పేరుతో ఈ నివేదికను ప్రచురించారు. ఈ నివేదిక  ఉద్దేశ్యం ప్రజలు తప్పుడు సమాచారాన్ని ఎలా, ఎక్కడ నుండి దర్యాప్తు చేస్తారో తెలుసుకోవడం.

ఈ నివేదిక ప్రకారం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల సోషల్ మీడియా యూజర్లు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన సమాచారం నిజమని నమ్ముతున్నారట. అలాగే ఏదైనా సమాచారం వాస్తవికతను చెక్ చేయడానికి తరచుగా సోషల్ మీడియా సహాయం కూడా తీసుకుంతున్నారట.

సర్వే ప్రకారం, 37 శాతం మంది ప్రజలు వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియాను సందర్శిస్తున్నారు. దావా ప్రకారం, మెక్సికో, దక్షిణాఫ్రికా ప్రజలలో 43 శాతం మంది వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారట, అయితే భారతదేశం గురించి మాట్లాడితే 54 శాతం మంది ప్రజలు వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ఈ సంఖ్య UKలో 16 శాతం, USలో 29 శాతంగా ఉంది.

భారతదేశంలో 87 శాతం మంది ప్రజలు గూగుల్, సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం నిజమని నమ్ముతున్నారట. దావా ప్రకారం, ప్రపంచంలోని మూడొంతుల మంది ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ఖచ్చితంగా నిజమని అనుకుంటున్నారు.

ఈ సర్వేలో US, UK, భారతదేశం, దక్షిణాఫ్రికా, మెక్సికో నుండి 5,000 మంది మాత్రమే చేర్చబడినందున, ఈ సర్వేను పూర్తిగా నమ్మడం కష్టం. ఈ సర్వేలో పాల్గొన్న 25-44 ఏళ్ల మధ్య వయసున్న వారు సోషల్ మీడియాలో షేర్ చేసేవాటిలో వాస్తవికతపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios