ఆ ఊరిలో అంతా శాఖాహారులే, మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్ ఇండియాలో ఎక్కడుందో తెలుసా..?
ఏ ఊరిలో అయినా వెజిటేరియన్స్ ఉంటారు.. నాన్ వెజ్ తీనేవాళ్ళు ఉంటారు.. రెండు రకాల వారుఉంటారు. కాని ఒక ఊరిలో మాత్రం ఊరు ఊరంతా నాన్ వెజ్ ముట్టుకోరంట.. శాకాహారులకు అడ్డగా మారిన ఆ ఊరు ఏఊరో తెలుసా..?
eating food
మన దేశంలో ఏ ఊరు తీసుకున్నా.. శాఖాహారులు.. మాంసాహారులు రెండు రకాల జనాలు ఉంటారు. అసలు చెప్పుకోవాలంటే వెజిటేరియన్స్ తగ్గిపోతున్నారు మాంసాహారులు ఎక్కువైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఒ కుంటుంబం కూడా కాదు ఊరు ఊరంతా శాఖాహారులుగా ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా..?
నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఊరు ఊరంతా మాంసాన్ని దగ్గరకు రానివ్వరు. ఊళ్ళో ఎవరైనా నాన్ వెజ్ తింటే ఇక అంతా.. వారికి కఠిన శిక్షలు అమలు అవుతాయి. అయినా అసలు ఎవరై ఊళ్ళో నాన్ వెజ్ తినరు. ఒకే మాటపై నిజాయితీగా ఉంటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా..? నిజానికి ఇండియాలో పూర్తిగా శాఖాహార గ్రామాలుగా రెండు ఉన్నాయి. ఒకటి బిహార్ లో ఉంటే.. మరొకటి మహారాష్ట్రాలో ఉంది.
బీహార్‌లోని గయ జిల్లాలో బిహియా అనే ఊరుంది. ఈ ఊరికి ఓ చరిత్ర ఉంది. మూడు శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు నియమ నిష్ఠలతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. 400 కుటుంబాలు ఉన్న ఈగ్రామంలో 300 ఏళ్ల నుంచి అందరు శాకాహారులుగానే కొనసాగుతున్నారు. వీరు పూజించే బ్రహ్మ బాబా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శాకాహార జీవన విధానాన్నే అవలంబించాలన్నది వీరి నమ్మకం.
ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని ఈ తరం వారు కూడా పాటిస్తున్నారు. ఇక్కడి వారిని పెళ్లి చేసుకుని వచ్చే వారు కూడా ఇదే లైఫ్ స్టైన్ లో ఆమలు చేయాల్సిందే. శాకాహారులుగానే మారుతున్నారు. వీరు మద్యపానానికి దూరంగా ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినరు. ఈగ్రామంతో పాటు మరో గ్రామం కూడా పూర్తి శాఖాహార గ్రామంగా ఉంది. అది మహారాష్ట్రాలో ఉంది.
మహారాష్ట్ర.. సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకాలో రేనవి అనే గ్రామం కూడా స్వచ్ఛమైన శాఖాహార గ్రామంగా నిలిచింది. వీరు కూడా గయలోగ్రామంలానే వందల సంవత్సరాలుగా శాఖాహారులుగా జీవిస్తున్నారు. మాంసాన్ని ముట్టరు. ఊళ్లోకి తీసుకురారు. ఈ గ్రామంలో ప్రసిద్ధ, పవిత్రమైన రేవణసిద్ధ దేవాలయం ఉంది. అందువల్ల ప్రజలు తరతరాలుగా శాఖాహారం మాత్రమే తింటున్నారు.
అంతే కాదు ఇక్కడి అమ్మాయిలను కాని.. అబ్బాయిలను కాని పెళ్ళాడాలి అంటే ఈరూల్ పాటించాల్సిందే. పెళ్లి తర్వాత శాఖాహారులుగా మారాకే ఈ ఊళ్లో అడుగు పెడతారు. పెళ్లికి ముందే ఈ నిబంధన చెబుతారు. అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటారు.
దాదాపు 3 వేలకు పైగా జనాబా ఉన్న ఈగ్రామంలో శ్రీ రేవణసిద్ధ నాథుని పవిత్ర స్థలం. నవనాథులలో ఏకనాథుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశారు. అన్ని కులాలు, మతాల వారు నివసిస్తున్న ఈగ్రామంలో ప్రజలంతా.. ఇక్కడి ఆచార వ్యవహారాలను నిత్యం పాటిస్తూ వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయం ప్రతిజ్ఞ చేసే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. వృద్ధులు కూడా విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు.
మహాశివరాత్రి నుంచి రెనవిలో రేవణసిద్ధ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది దక్షిణ మహారాష్ట్రలో అతిపెద్ద యాత్రగా ఖ్యాతిని పొందింది. రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాఖాహారంగా మారింది. హిందువులు, ముస్లింలతో సహా అన్ని మతాల ప్రజలు ఈ ఊళ్లో నివసిస్తున్నా.. వారు కూడా శాఖాహారులుగానే ఉంటున్నారు.