Asianet News TeluguAsianet News Telugu

శామ్‌సంగ్ కొత్త జనరేషన్ నియో క్యూఎల్‌ఇడి టివి లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి..

శామ్సంగ్  కొత్త జనరేషన్ నియో క్యూఎల్‌ఇడి టివిలని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ టీవీలు 5 సైజులలో 85 అంగుళాలు, 75 అంగుళాలు, 65 అంగుళాలు, 55 అంగుళాలు, 50 అంగుళాలలో లభిస్తున్నాయి. 

samsung next generation neo qled tv launched in india know price and specifications here
Author
Hyderabad, First Published Apr 15, 2021, 8:06 PM IST

కొరియన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్  అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్‌ఇడి టివి సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో బెజెల్స్  లేకుండా ఇన్ఫినిటీ వన్ డిజైన్, రియల్ పిక్చర్ క్వాలిటీ అందించింది. ఈ మినీ ఎల్‌ఈడీలు సాధారణ ఎల్‌ఈడీల కంటే 40 రెట్లు చిన్నవని పేర్కొన్నారు, ఈ కారణంగా చాలా చక్కటి  లైట్, కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.

శామ్సంగ్ ఈ సరికొత్త డిస్ ప్లే టెక్నాలజీని నియో క్యూఎల్‌ఇడి  8కె, 4కె టివి మోడళ్లలో  తీసుకువస్తోంది. ఈ టీవీలు 5 సైజులలో 85 అంగుళాలు, 75 అంగుళాలు, 65 అంగుళాలు, 55 అంగుళాలు, 50 అంగుళాలలో లభిస్తున్నాయి. నియో క్యూఎల్‌ఇడి టివిని ముందే బుక్ చేసుకున్న వినియోగదారులకు గెలాక్సీ టాబ్ ఎస్ 7 ప్లస్, గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ ఎల్‌టిఇ, రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. 

2021 నియో క్యూఎల్‌ఇడి టివి లైనప్ గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది అల్ట్రా వైడ్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందుకోసం టీవీలో మోషన్ యాక్సిలరేటర్ టర్బో ప్లస్ ఫీచర్ అందించారు. ఇది సూపర్ అల్ట్రా-వైడ్ గేమ్ వ్యూ, పిసి అండ్ కన్సోల్ గేమ్ లను ఆడటానికి గేమర్‌లకు అవకాశం ఇస్తుంది. దీనిలో కొత్త సహజమైన సెల్ఫ్ -ఎక్స్ప్లానేటరి గేమ్ బార్‌  ఉంది, గేమర్స్ స్క్రీన్  సులభంగా అడ్జస్ట్ చేయడానికి, ఇన్‌పుట్ లాగ్‌ చెక్ చేయడానికి, వైర్‌లెస్ హెడ్‌సెట్‌లను జోడించడానికి  ఇంకా మరెన్నో అందిస్తుంది.

also read ఇండియాలోకి ఐవా బ్రాండ్ రిఎంట్రీ.. ఒకేసారి 6 ఆడియో ఉత్పత్తులు విడుదల.. ...

కొత్త సిరీస్‌లో శామ్‌సంగ్ టీవీ ప్లస్ సర్వీస్ కూడా ఉంది, దీనిని ఇటీవల భారతదేశంలో ప్రవేశపెట్టారు. న్యూస్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, గేమింగ్ అండ్ సైన్స్, స్పోర్ట్స్ అండ్ అవుట్ డోర్, మ్యూజిక్, మూవీస్, షార్ట్ టైమ్  షోలు వంటివి సబ్ స్క్రిప్షన్, సెట్-టాప్ బాక్సులు  వంటి  ఎక్స్ టర్నల్ డివైజెస్ వంటి లేకుండా త్వరగా చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.  

 శామ్సంగ్  కొత్త నియో క్యూఎల్‌ఇడి 8కె టివి సిరీస్ రెండు మోడళ్లలో లభిస్తుంది. వీటిలో 75 ఇంకా 65 అంగుళాల క్యూఎన్ 800ఎ, 85 అంగుళాల క్యూఎన్ 900 ఎ ఉన్నాయి. 2021 నియో క్యూఎల్‌ఇడి  4కె టివి సిరీస్ 75, 65, 55 అంగుళాల క్యూఎన్ 85ఎ ఇంకా 85, 65, 55 అలాగే 50 అంగుళాల క్యూఎన్ 900 ఎ అనే రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. 

నియో క్యూఎల్‌ఇడి సిరీస్  ధర రూ .99,990 నుండి ప్రారంభమవుతుంది. శామ్‌సంగ్ స్టోర్, ఎలక్ట్రానిక్ స్టోర్, శామ్‌సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ సహా అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తుంది. వినియోగదారులకు ప్యానెల్స్ పై 2 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, నియో క్యూఎల్‌ఇడి 4కె టివిలపై 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios