Asianet News TeluguAsianet News Telugu

బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

భారత్​లో స్మార్ట్​ ఫోన్​ కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక సంస్థ కొత్త మోడల్ విడుదల చేస్తే, ఆ వెంటనే దానికి పోటీగా ప్రత్యర్థి సంస్థలు తమ మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈ పోటీలో ఏఏ సంస్థలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి... తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 64 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం...  

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India
Author
Hyderabad, First Published Dec 5, 2019, 12:06 PM IST

న్యూఢిల్లీ: మొబైల్​ ఫోన్ కంపెనీల మధ్య ప్రస్తుతం కెమెరాల యుద్ధం నడుస్తోంది. కెమెరాల సంఖ్యతో పాటు.. రిజల్యూషన్​ వంటి ఫీచర్లపై కంపెనీలు ఎక్కువగా పోటీ పడుతున్నాయి. 2012 నుంచి మొదలైన ఈ ట్రెండ్ మధ్యలో కాస్త తగ్గింది. ఈ ఏడాది 48 మెగా పిక్సెల్​ కెమెరాతో మళ్లీ పోటీ ఊపందుకుంది. ఇప్పుడు 64 మెగా పిక్సెల్​తో సంస్థలు పోటీపడుతున్నాయి.

ప్రస్తుతం భారత్​లో 64 మెగా పిక్సెల్​ రియర్​ కెమెరాతో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ.14,990తో మొదలు అవుతున్నది. ఈ ధరలో లభించే మోడల్ ఫోన్లు, వాటిల్లోని  వాటి ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. 

భారత్​లో 48 ఎంపీ రియర్​ కెమెరా స్మార్ట్​ ఫోన్​ను విడుదల చేసిన సంస్థగా 'హానర్'​ నిలిచింది. హానర్​ సహా షియోమీ, శామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ రియల్​మీ ఏకంగా 4 కెమెరాలు 64 మెగా పిక్సెల్​తో కొత్త స్మార్ట్​ ఫోన్​ను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో.. 'రియల్​ మీ ఎక్స్​టీ' పేరుతో ఈ మోడల్​ మార్కెట్​లోకి వచ్చింది.

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India

రియల్​మీ ఎక్స్​టీ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్​ విత్ 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్​ విత్ 64 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్​లలో అందుబాటులోకి ఉన్నాయి. 4జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.15,999, 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.18,999 గా నిర్ణయించింది.

ఇంకా రియల్ మీ ఎక్స్ టీ ఫోన్‌లో 6.4 అంగుళాల ఆమోలెడ్​ డిస్​ప్లేఇన్ డిస్​ప్లేతోపాటు ఫింగర్ ​ప్రింట్ ​స్నాప్ ​డ్రాగన్ ఫీచర్ ఉన్నాయి. 712 ప్రాసెసర్‌కు తోడు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ జత చేశారు.

ఇక రియల్​ మీ ఎక్స్​టీకి పోటీగా అక్టోబర్​లో రెడ్​మీ నోట్​8 ప్రోను విడుదల చేసింది షియోమీ. బ్యాకప్ నాలుగు కెమెరాలతో (64 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ) ఈ ఫోన్ విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 8 ప్రో ఫోన్‌ 4జీబీ ర్యామ్​ విత్ 64 జీబీ స్టోరేజి​ ​ వేరియంట్​ ధర రూ.14,999లకు,  6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజి​ వేరియంట్ ఫోన్ ధర ధర రూ.15,999లకు, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజి​ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999లకు లభిస్తుంది. 

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India

6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ, డాట్​ నాచ్​ డిస్​ప్లే కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 రక్షణతోపాటు 20 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా, మీడియా టెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్లిక్విడ్​ కూలింగ్​ వ్యవస్థ కలిగి ఉంది. అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ (బిల్ట్​ ఇన్​)అండ్రాయిడ్​ 9 పై ఆపరేటింగ్ వ్యవస్థపై ఇది పని చేస్తుంది. 4,500 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

తొలుత మిడ్​ రేంజ్​ నుంచి ప్రీమియం ఫోన్​లో 64 ఎంపీల రియర్​ కెమెరా ఫోన్​ను విడుదల చేసిన రియల్​ మీ గతనెల​లో పూర్తి ప్రీమియం మోడల్​ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్​మీ ఎక్స్​2 ప్రోగా ఈ మెడల్​ను భారత్​ మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో (64+13+8+20) క్వాడ్​ కెమెరా సెటప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  8 జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ స్టోరేజి, 12జీబీ ర్యామ్​ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్​తో పాటు.. ఓ ప్రత్యేక ఎడిషన్​ను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.29,999, రూ.33,999, రూ.34,999గా నిర్ణయించింది.

రియల్​ మీ ఎక్స్​2 ప్రో ఫోన్‌లో 6.50 అంగుళాల డిస్​ప్లే ఉంటుంది. స్నాప్​డ్రాగన్ 855+ ప్రాసెసర్​ గల ఈ ఫోన్‌కు 50 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ వెసులుబాటు ఉంది. 4,000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. అదనంగా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ పై పని చేస్తుంది.

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India

​48 మెగా పిక్సెల్​ కెమెరా ఫోన్లలో గట్టిపోటీ ఇచ్చిన శామ్‌సంగ్​.. ఇటీవల 64 ఎంపీ కెమెరా పోటీలోకి ప్రవేశించింది. అయితే మూడు కెమెరాల (64 + 8 + 5) రేంజ్​లో ఈ ఫోన్​ను తీసుకువచ్చింది శామ్‌సంగ్​. రియల్​ మీ ఎక్స్​2 ప్రో మోడల్​కు పోటీగా.. ప్రీమియం సెగ్మెంట్​లో ఈ స్మార్ట్​ ఫోన్​ను ఆవిష్కరించింది శామ్‌సంగ్​​ .6 జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీల్లో ఈ మోడల్​ అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.28,999, రూ.30,999గా శామ్‌సంగ్​ నిర్ణయించింది.

శాంసంగ్​ గెలాక్సీ ఏ 70ఎస్ ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్​ప్లే, వాటర్​ డ్రాప్​ నాచ్, ​32 ఎంపీల సెల్ఫీ కెమెరాతోపాటు 4,500 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి. ఇంకా స్నాప్​డ్రాగన్ 675 ప్రాసెసర్​ కూడా అమర్చారు. ఇంకా ఈ పోటీని మరింత తీవ్ర చేసేందుకు శామ్‌సంగ్​ త్వరలోనే హై రెజల్యూషన్​ 60 ఎంపీ ఐఎంఎక్స్ 686 కెమెరా ఫోన్​ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఐఎంఎక్స్ 686తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. రెడ్​ మీ ఏకంగా 108 మెగా పిక్సెల్​ల కెమెరాను తీసుకురానుంది.

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India

నవంబర్​ 5న 'ఎమ్​ఐ సీసీ9 ప్రో' పేరుతో ఈ ఫోన్​ను చైనాలో విడుదల చేసింది షియోమీ. తరువాత దాని గ్లోబర్ వెర్షన్​ 'ఎమ్​ఐ నోట్​ 10' స్మార్ట్​ఫోన్​ను నవంబర్​ 14న పోలాండ్​లో ఆవిష్కరించారు. ఈ నెలలోనే ఈ మోడల్​ భారత్​కు వచ్చే అవకాశముంది.

Mobile Phones With 64MP Primary Rear Camera to Purchase in India

Follow Us:
Download App:
  • android
  • ios