Asianet News TeluguAsianet News Telugu

బెస్ట్ డిస్‌ప్లేతో సెన్స్ కొత్త స్మార్ట్ టీవీలు.. అతితక్కువ ధరకే 55 అంగుళాల టివి..

సెన్స్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.9,999. ఈ ధరలో 32-అంగుళాల మోడల్ లభిస్తుంది. 43 అంగుళాల మోడల్ ధర రూ.16,499గా, 55 అంగుళాల మోడల్ ధర రూ.33,499గా, 65 అంగుళాల మోడల్ ధర రూ.42,499గా ఉంచారు. 

Domestic company SENS launches new smart TVs, great display is available at starting price of Rs 10,000
Author
First Published Dec 20, 2022, 9:02 PM IST

దేశీయ కంపెనీ SENS భారత మార్కెట్‌లో ఒకేసారి 7 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలను రూ.9,999 ప్రారంభ ధరతో పరిచయం చేశారు. కొత్త సెన్స్ స్మార్ట్ టీవీలో LumiSENS అండ్ FluroSENS డిస్‌ప్లే అందించారు. 32 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు డిస్‌ప్లే ప్యానెల్‌లు టీవీతో ఉన్నాయి. ఈ టీవీలు గూగుల్ టి‌వి ఓ‌ఎస్ ప్లాట్‌ఫారమ్‌లో పని చేస్తాయి. TVతో 4K వరకు రిజల్యూషన్ సపోర్ట్ ఉంది. 

SENS స్మార్ట్ టీవీ ధర
సెన్స్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.9,999. ఈ ధరలో 32-అంగుళాల మోడల్ లభిస్తుంది. 43 అంగుళాల మోడల్ ధర రూ.16,499గా, 55 అంగుళాల మోడల్ ధర రూ.33,499గా, 65 అంగుళాల మోడల్ ధర రూ.42,499గా ఉంచారు. ఈ సెన్స్ స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. 

సెన్స్ డ్విన్సీ స్పెసిఫికేషన్‌లు అండ్ ఫీచర్లు
సెన్స్ Dwinci TV 178 డిగ్రీల వ్యూతో QLED డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ ప్లేతో 350 nits బ్రైట్‌నెస్, HDR10 అండ్ డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఉంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mali-G52 GPU TVతో ఇచ్చారు. టీవీతో 2జి‌బి ర్యామ్ 16 జి‌బి స్టోరేజ్ ఉంది. 

సెన్స్ డ్విన్సీ స్మార్ట్ టీవీలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, HDMI పోర్ట్, USB పోర్ట్, ఈథర్‌నెట్ ఇంకా కనెక్టివిటీ కోసం ఆప్టికల్ పోర్ట్‌లు ఉన్నాయి. టీవీతో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇంకా యూట్యూబ్ వంటి OTT యాప్స్ కూడా చూడవచ్చు. అలాగే, రిమోట్‌లో దీని కోసం ప్రత్యేక హాట్‌కీలు ఇచ్చారు.

సెన్స్ Pikaso స్మార్ట్ TV స్పెసిఫికేషన్లు అండ్ ఫీచర్లు
50 అంగుళాలు, 55 అంగుళాల 4K డిస్‌ప్లే సెన్స్ పికాసో స్మార్ట్ టీవీతో లభిస్తుంది. డిస్ ప్లేతో 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్  ఉంటుంది. టీవీ క్వాడ్-కోర్ A53 ప్రాసెసర్, 2 జి‌బి ర్యామ్ తో 16జి‌బి స్టోరేజ్ ఉంది. సెన్స్ పికాసో స్మార్ట్ టీవీలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, HDMI పోర్ట్, USB పోర్ట్, ఈథర్‌నెట్ ఇంకా కనెక్టివిటీ కోసం ఆప్టికల్ పోర్ట్‌లకు సపోర్ట్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌  యాప్స్ కూడా ఈ టీవీకి సపోర్ట్ చేస్తాయి. టీవీకి 20W ఆడియో అవుట్‌పుట్‌తో పాటు డాల్బీ ఆడియో ఇంకా DTS సపోర్ట్ ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios