ఒక్క సెకనులోపు వెయ్యి హెచ్‌డి సినిమాలు డౌన్‌లోడ్.. ప్రపంచంలోనే ఫాస్ట్ ఇంటర్నెట్...!
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి బిలియన్ల మంది పని చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పై విపరీతమైన భారం పడుతున్న సమయంలో చేసే పరిశోధనలు గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి బిలియన్ల మంది పని చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పై విపరీతమైన భారం పడుతున్న సమయంలో చేసే పరిశోధనలు గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.
మెల్‌బోర్న్: అర సెకనులో వెయ్యికి పైగా హై-డెఫినిషన్ సినిమాలను డౌన్‌లోడ్ చేయడంలో సహాయపడే ఒక చిప్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని కొందరు పరిశోధకులు నమోదు చేసింది,కొత్తగా రికార్డ్ చేయబడిన ఇంటర్నెట్ వేగం మనం ఇంటర్నెట్‌ను ఉపయోగించే విధానాన్ని మార్చగలదు.
వారు తయారు చేసిన ‘మైక్రో-కోంబ్' ఆప్టికల్ చిప్‌లో వందలాది ఇన్‌ప్రారెడ్ లేజర్లుంటాయి. వీటి ద్వారా ఒక సెకనులో 44.2 టెరాబైట్ల డేటాను పంపవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి బిలియన్ల మంది పని చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ పై విపరీతమైన భారం పడుతున్న సమయంలో చేసే పరిశోధనలు గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.
మోనాష్, స్విన్బర్న్, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు డేటా పంపిణీలో ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. వారు తయారు చేసిన ‘మైక్రో-కోంబ్' ఆప్టికల్ చిప్‌లో వందలాది ఇన్‌ప్రారెడ్ లేజర్లుంటాయి. ఈ ఆప్టికల్ చిప్‌లో నుండి వేగంగా ఇంటర్నెట్ డేటాని విజయవంతంగా పరీక్షించారు అలాగే దాని స్పీడ్ ని రికార్డ్ చేశారు.
ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సామర్థ్యాన్ని వేగంగా ట్రాక్ చేసే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒకే సమయంలో 1.8 మిలియన్ల ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, గరిష్ట కాలంల్లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ సామర్థ్యం ఈ టెక్నాలజీకి ఉంది. ఇటువంటి పరిశోధనలు సాధారణంగా ప్రయోగశాలకు మాత్రమే పరిమితం చేయబడతాయి.
also read అమెజాన్,ఫ్లిప్ కార్టులకు దడ పుట్టిస్తున్న జియోమార్ట్ : 200 నగరాల్లో సేవలు అందుబాటులోకి...
ఫీల్డ్ ట్రయల్‌లో మైక్రో-కొంబ్ ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఒకే ఆప్టికల్ చిప్ నుండి అత్యధిక డేటాను ఉత్పత్తి చేయగలిగే సామర్ధ్యం దీనికి ఉంది.
"రిమోట్ వర్క్ , సోషలైజింగ్, స్ట్రీమింగ్ కోసం ఇంటర్నెట్‌ను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం వలన, రెండు, మూడు సంవత్సరాలలో ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయో మేము ప్రస్తుతం తేలుసుకుంటున్నాము" అని డాక్టర్ బిల్ కోర్కోరన్, మోనాష్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో కో-లీడ్ రచయిత, లెక్చరర్.
"ఇది మా కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల కోసం ఉపయోగించే పెద్ద స్థాయి. ఈ డేటాను సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, భవిష్యత్ రవాణా కోసం ఉపయోగించవచ్చు, ఇది మందులు, విద్య, ఫైనాన్స్, ఇ-కామర్స్ పరిశ్రమలకు కూడా సహాయపడుతుంది" అని కోర్కోరన్ వివరించారు.
ప్రస్తుత ట్రాన్స్మిటర్లను పరిమాణం, బరువు లేదా వ్యయం పెంచకుండా సెకనుకు వందల గిగాబైట్ల నుండి సెకనుకు పదుల టెరాబైట్ల వైపుకు పెంచడం ఈ ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తు ఆశయం. "దీర్ఘకాలికంగా, ప్రస్తుత ఆప్టికల్ ఫైబర్ లింక్‌లలో తక్కువ ఖర్చుతో ఈ విధమైన డేటా రేటును సాధించగలిగే ఇంటిగ్రేటెడ్ ఫోటోనిక్ చిప్‌లను సృష్టించాలని మేము ఆశిస్తున్నాము" అని ఆర్‌ఎంఐటి నుండి విశిష్ట ప్రొఫెసర్ అర్నాన్ మిచెల్ చెప్పారు.
ప్రారంభంలో, డేటా సెంటర్ల మధ్య అల్ట్రా-హై-స్పీడ్ కమ్యూనికేషన్లకు ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. "అయితే, ఈ టెక్నాలజి తగినంత తక్కువ ఖర్చుతో, కాంపాక్ట్ గా మారుతుందని మేము ఉహించగలము, దీనిని ప్రపంచంలోని నగరాల్లోని సామాన్య ప్రజలు వారి వాణిజ్య ఉపయోగం కోసం ఉపయోగించుకోవచ్చు" అని మిచెల్ తెలిపారు.