అమెజాన్,ఫ్లిప్ కార్టులకు దడ పుట్టిస్తున్న జియోమార్ట్ : 200 నగరాల్లో సేవలు అందుబాటులోకి...

సేవలు ప్రారంభించిన నెల రోజుల్లోపే రిలయన్స్ జియోమార్ట్.. తన ప్రతర్థి సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టులకు గుబులు పుట్టిస్తోంది. రిల‌య‌న్స్ జియోమార్ట్ 200 నగరాల్లో సేవలు ప్రారంభిస్తున్నది. తెలంగాణలోని బోధన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం పరిధిలో జియోమార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  

Reliance launches JioMart services in over 200 cities  in india

ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ప్లస్ జియో అనుబంధ ఆన్‌లైన్ వెంచర్ జియో మార్ట్ ఆన్‌లైన్ గ్రోసరీ సేవలను వేగవంతం చేసింది. గత నెల  పైలట్ ప్రాజెక్టుగా  ప్రారంభించిన ఈ సేవలను ఇపుడు జియోమార్ట్ మరింత విస్తరించింది.

కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆంక్షల్లో కొంతమేరకు సడలిస్తున్న నేపథ్యంలో జియోమార్ట్  కీలకమైన ఆన్ లైన్ గ్రాసరీ సేవల్లోకి మరింత వేగంగా దూసుకొస్తోంది. దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని పంపిణీ చేయనుంది.

ఈ మేరకు రిలయన్స్ స్మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ఈ ప్రకటన  చేశారు. రాజస్థాన్‌లోని నోఖా, తెలంగాణలోని బోధన్, తమిళనాడులోని నాగార్‌కాయిల్, ఆంధ్రాలోని తాడేపల్లిగుడెం, ఒడిశాలోని రాయగఢ్, పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో తమ కంపెనీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

also read నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారా... అయితే మీ కనెక్షన్‌ కట్.. ...

దీంతో ఈ-కామర్స్ సెగ్మెంట్‌లో ఉన్న ప్ర‌ముఖ ఆన్‌లైన్ డెలివ‌రీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌కు  గట్టి పోటీ ఇవ్వనుంది. నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలలో విజయవంతంగా పైలట్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన ఒక నెల తరువాత, అనేక పట్టణాలు. నగరాల్లో తన సేవలను విస్తరిస్తున్నట్టు  జియోమార్ట్ ప్రకటించింది.

కొత్తగా ప్రారంభించిన ఈ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్  ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటి ఇతర రోజువారీ కొనుగోళ్లకు వినియోగదారులు లాగిన్ కావచ్చు. అయితే ప్ర‌స్తుతానికి త‌న వెబ్ సైట్ ద్వారా మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల ఆర్డ‌ర్లు తీసుకుంటుండ‌గా, త్వ‌ర‌లో జియోమార్ట్ యాప్  ఆవిష్కరించనున్నది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios