Asianet News TeluguAsianet News Telugu

చైనా యాప్ బ్యాన్ పై టిక్​టాక్ స్టార్ల ఆవేదన

టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై వాటి యూజర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిక్ టాక్ యూజర్లు చెబుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

For Small-Town TikTok Stars, Mixed Emotions After Government Blocks App
Author
Hyderabad, First Published Jul 2, 2020, 11:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: భారత్​లో విపరీతంగా ప్రజాదరణ పొందిన యాప్ టిక్​టాక్​. దీని ద్వారా చాలా మంది ఇందులో తమదైన నైపుణ్యాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ  పేరు తెచ్చుకున్నారు. అయితే సోమవారం టిక్​టాక్​ సహా 59 యాప్​లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ వేదికనే నమ్ముకున్న పలువురు టిక్​టాక్​ యూజర్లు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆదాయం, బతుకుదెరువు కోల్పోయామని వాపోతున్నారు.

టిక్​టాక్​పై నిషేధంతో ఎవరి ప్రతిభను అడ్డుకోలేరని 23 ఏళ్ల నిహారికా జైన్ చెప్పారు​. ఈమెకు ఆ యాప్​లో 28 లక్షల మంది ఫాలోవర్లు ఉండేవారు. ఫలితంగా నెలకు రూ.30వేల ఆదాయం పొందేది. ఈ షార్ట్​ వీడియో యాప్​ నిషేధం తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘కేంద్రం నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. మేం కంటెంట్​ క్రియేటర్లం. మా ప్రతిభ​ వల్లే పాపులర్​ అయ్యాం. టిక్​టాక్​ లేకపోతే మరో యాప్​ ద్వారా మా ప్రతిభను ప్రదర్శిస్తాం" అని జైన్​ చెప్పింది.

మాస్​ కమ్యునికేషన్స్​లో పట్టా పొందిన మరో అమ్మయి ప్రస్తుతం రియాలిటీ షోలలో ఫ్రీ లాన్సర్​గా పనిచేస్తున్నారు. టిక్​టాక్​లో వీడియోలు పెట్టడం, విభిన్న స్టైల్స్​​ అనుకరణ, ఫ్యాషన్​పై దృష్టి పెట్టడం వల్ల తన కెరీర్​ను అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు.

గతేడాది ఆగస్టులో ఈ యాప్​లో చేరిన ఈమె.. దాదాపు 2.8 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. వేర్వేరు సంస్థలకు ప్రచారం కల్పించేలా వీడియోలు చేసి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తుండేవారు. 

టిక్ టాక్ యాప్​ మీద నిషేధించడం తనను షాక్​నకు గురి చేసిందని ఆ అమ్మాయి చెప్పారు. ‘టిక్​టాక్​​లో వీడియోలు పెట్టడమే నా జీవనాధారం. అయితే ప్రభుత్వ నిర్ణయం సరైనదే. మోదీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నాం’ అని ఆమె చెప్పారు.

నిషేధం నిర్ణయం తమ మీద ప్రభావం చూపదని సుజితా​ జైన్ (2) తెలిపారు​. ఆమె 'ది గ్రేట్​ ఇండియన్​ ఫుడీ' అనే అకౌంట్​ను నడిపేది. అయితే టిక్​టాక్​ నిషేధం వల్ల ఈ కంటెంట్​ను వేరే యాప్స్‌లో పోస్టు చేస్తానని చెబుతోంది. ఇప్పటికే యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన వీడియోలు పోస్టు చేస్తున్నట్లు తెలిపింది.

టిక్​టాక్​లో ప్రసిద్ధి చెందిన బీజేపీ నేత​ సోనాలీ ఫొగాట్​ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమెకు టిక్​టాక్​లో 2,80,000 ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్​ వీడియోలతో సోనాలీ ఆకట్టుకునేవారు. ఈ యాప్​ వల్లే 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఈ హర్యానా యువతి తొలిసారి బాగా పేరుతెచ్చుకున్నారు.

also read అమెజాన్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ భారీ డీల్... ...

‘ప్రభుత్వ నిర్ణయానికి బద్ధురాలినై ఉన్నా. భారత్​ నిధులు చైనాకు తరలిపోతున్నాయి. ఆర్థికంగా ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతోంది. వాటితోనే మన బలగాలపై ఆ దేశం దాడులకు పాల్పడుతోంది’ అని సోనాలీ ఫొగాట్ చెప్పారు.

‘మేం మిగతా యాప్​లను ఫాలో అవుతున్నాం. ఇన్​స్టా, ఫేస్​బుక్​, ట్విట్టర్​ ఇందులో ఉన్నాయి. మనదేశంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉండగా మనమెందుకు ఇతరుల మీద ఆధారపడాలి?’  అని ఫొగాట్ ప్రశ్నించారు.

పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడే​ మహేంద్ర దోగ్నే అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘నిషేధం వల్ల కాస్త ఇబ్బందులున్నాయి. దేశ భద్రతకు ముప్పు అంటే కచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇది త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.

ఆయనకు 90 లక్షల మంది టిక్​టాక్​ ఫాలోవర్లు, 14.9 లక్షల మంది యూట్యూబ్​ యూజర్లు ఉన్నారు. ‘టిక్​టాక్​ వల్లే చాలా మంది ఇండియన్​ కంటెంట్​ క్రియేటర్లు తమ కెరీర్​ను నెట్టుకొస్తున్నారు. ఈ ఫ్లాట్​ఫాం వల్లే వారు సంపాదించుకోగలుగుతున్నారు. అయితే నేను మాత్రం ఆఫ్​లైన్​లో సెమినార్లు ఇచ్చుకుంటా’ అని మహేంద్ర వ్యాఖ్యానించారు.

టిక్​టాక్​పై నిషేధంతో చిన్న సంస్థలు ప్రచారాలకు ఇబ్బందులు ఎదురవుతాయని మాంక్​ ఎంటర్​టైన్​మెట్​ సీఈఓ విరాజ్​ చెప్పారు. టిక్​టాక్​ వంటి యాప్ ద్వారానే 25-30 శాతం సంస్థలు యువతను ఆకట్టుకొని వ్యాపారాలను వృద్ధి చేసుకునేవి. వారి కోసం యాడ్​లు సహా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ నిషేధంతో ఆ ప్లాన్​లను మార్పుచేసుకొని వేరే సంస్థలతో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2012లో చైనాకు చెందిన బైట్​డ్యాన్స్​ సంస్థ టిక్​టాక్​ను రూపొందించింది. డ్యాన్స్​, లిప్​ సింక్​, కామెడీ వంటి చిన్న వీడియోలకు ఇది వేదిక. 2017లో భారత్​లో అడుగుపెట్టిన ఈ యాప్​ విస్తృతంగా మార్కెట్​ పెంచుకుంది. 16-24 ఏళ్ల వయసున్నవారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఒక్క భారత్​లోనే 200 మిలియన్ల ఫాలోవర్లు ఈ యాప్​ సొంతం.

టిక్​టాక్​కు భారతీయ ప్రత్యామ్నాయం ఉంది. చింగారీ పేరుతో తయారైన ఈ యాప్​నకు విపరీతమైన క్రేజ్​ దక్కుతోంది. టిక్​టాక్​ తరహాలోనే షార్ట్​ వీడియోలను షేర్​ చేసేందుకు 2018 నవంబర్​లో గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులోకి వచ్చింది. 

ఈ యాప్​ సాయంతో వీడియోలను డౌన్​లోడ్​, అప్​లోడ్​ మాత్రమే కాదు చాటింగ్​ చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల్లోనే ఈ యాప్​ 400 శాతం వృద్ధి సాధించినట్లు చింగారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios