Asianet News TeluguAsianet News Telugu

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

మహిళా క్రికెట్ జట్టు కోచ్ రమేష్ పొవార్, జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్ ను పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ క్రీడలో మెరిట్ ప్రాతిపదికను ఖాతరు చేయలేదు. 

Why Mithali Raj dropped?
Author
Hyderabad, First Published Nov 24, 2018, 11:40 AM IST

హైదరాబాద్: ట్వంటీ20 ప్రపంచ మహిళా క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచులో హైదరాబాదీ మిథాలీ రాజ్ ను పక్కన పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తమైంది. పరుగుల రాణిని డ్రాప్ చేయడం వెనక కేవలం క్రికెట్ కు సంబంధించిన వ్యవహారం మాత్రమే లేదని అంటున్నారు. శుక్రవారం ఇంగ్లాండుపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఓటమి పాలైంది. 

మహిళా క్రికెట్ జట్టు కోచ్ రమేష్ పొవార్, జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మిథాలీ రాజ్ ను పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ క్రీడలో మెరిట్ ప్రాతిపదికను ఖాతరు చేయలేదు. ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో పరుగుల వేటలో మిథాలీ రాజ్ రోహిత్ శర్మ (2,214), విరాట్ కోహ్లీ (2,106)లను దాటేసింది. 

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచుల్లో రెండింటిలో ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో మోకాలి దెబ్బ కారణంగా ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఆడలేకపోయింది.

అయితే, టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఆమె పట్ల వివక్ష కొనసాగుతూ వచ్చింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి లీగ్ మ్యాచులో ఆమెను ఎనిమిదో స్థానానికి తోశారు. ఓపెనర్ అయిన ఆమెను 8 స్థానానికి నెట్టడానికి తగిన కారణమేదీ లేదు. 

హర్మన్ ప్రీత్ కౌర్ వేరే స్థానాల్లో సరిగా ఆడలేనందున ఓపెనర్ గా దింపినట్లు, స్మృతి మందాన పరుగులు చేస్తున్నందున ఆమెను కొనాసగించి, మిథాలీ రాజ్ ను వెనక్కి నెట్టినట్లు కోచ్ రమేష్ పొవార్ చెప్పారు. అయితే, హర్మన్ సెంచరీ చేసింది. జెమిమా 59 పరుగులు చేసింది. దీంతో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ కు బ్యాటింగ్ రాలేదు. 

అయితే, అత్యంత క్లిష్టమైన దశలో విపరీతమైన చర్చల అనంతరం మిథాలీ రాజ్ ను పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో తాను ప్రతిసారీ ఆడే ఓపెనర్ స్థానంలో దించారు. ఈ మ్యాచులో మిథాలీ రాజ్ 56 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచుగా కూడా ఎంపికైంది. 

ఆ తర్వాత ఐర్లాండుతో జరిగిన మ్యాచులో 51 పరుగులు చేసింది ఈ మ్యాచును భారత్ 52 పరుగుల తేడాతో గెలుచుకుంది. మిథాలీ రాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచుగా ఎన్నికైంది.

ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుకు గాయం కారణంగా దూరమైంది. అయితే ఇంగ్లాండుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచుకు ఆమె పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంది. అయితే, ఆశ్చర్యకరంగా ఆమెను తుది జట్టులోకి తీసుకోలేదు. మ్యాచ్ వామప్ సెషన్ తర్వాత మిథాలీ రాజ్ సెమీ ఫైనల్ లో ఆడడం లేదని చెప్పారు. 

మ్యాచును ఒంటి చేతితో గెలిపించగల సత్తా ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాల కారణంగానే మిథాలీ రాజ్ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 35 ఏళ్ల వయస్సులో కూడా పరుగుల వరద పారిస్తున్న సీనియర్ ప్లేయర్ పట్ల అనుసరించే వైఖరి ఇదేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. తనకు తాను రిటైర్మెంట్ ప్రకటించే దిశగా మిథాలీ రాజ్ ను నెడుతున్నారనే సందేహం తలెత్తుతోంది.

సంబంధిత వార్తలు

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

మ్యాచ్ ఓడిపోయినందుకు.. ప్రెస్‌మీట్‌లోనే ఏడ్చేసిన ఐర్లాండ్ కెప్టెన్

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

చెలరేగిన విండీస్ బౌలర్లు...కేవలం 46 పరుగులకే ఆలౌట్

మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌‌పై భారత్ ఘన విజయం

Follow Us:
Download App:
  • android
  • ios