టీమిండియాకు పురుషుల జట్టుకు తాము ఏ మాత్రం తక్కువ కాదంటూ.. పాక్‌పై ఆధిపత్యాన్ని నిరూపించుకుంది భారత మహిళల జట్టు. టీ20 ప్రపంచకప్‌‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలింగ్ ధాటికి ఆచితూచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. బిస్మా మరూఫ్ 53, నిదా దర్ 52 పరుగులు చేసి పాక్‌ను గౌరవప్రద స్కోరు వద్ద నిలిపారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆడుతూ..పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ 56 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’’గా నిలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసినట్లయ్యింది. 

సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించడం అసాధ్యం: సెహ్వాగ్

''అతడిలో సెహ్వాగ్ కనిపిస్తున్నాడు...ఆ విషయంలో సెహ్వాగ్ కంటే మెరుగ్గా....''

కోహ్లీ కుర్రాడు...అందువల్లే ఆ దూకుడు: బాలీవుడ్ డైరెక్టర్ సపోర్ట్

''ధోనీ స్థానాన్ని భర్తీచేసేది అతడు మాత్రమే...దినేష్ కార్తిక్ కాదు''

వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోహ్లీ...ఎందుకలా అన్నానంటే...

ఇండియా రికార్డు బద్దలు...ఇక వరల్డ్ రికార్డుపై కన్నేసిన రోహిత్

కోహ్లీ నోట ఇలాంటి మాటలా.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ