భావోద్వేగాలను అదుపు చేసుకోవడం ఎంతటి వారికైనా కష్టమే. అది కంట్రోల్ తప్పినప్పుడు జనంలో ఉన్నామో.. ఒంటరిగా ఉన్నామో కూడా తెలియనంతగా కన్నీరు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు అదే స్థితిని ఎదుర్కొన్నారు ఐర్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ లారా డెలనీ.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్-బి పాకిస్తాన్‌, ఐర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 38 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ జవేరియా ఖాన్ 74 పరుగులతో అర్ధశతకం చేసి జట్టు గౌరవపదమైన స్కోరు చేసేందుకు తోడ్పడింది.

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షిల్లింగ్టన్ 27, జోసి 30 పరుగులతో పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐర్లాండ్ కెప్టెన్ లారా డెలనీ మాట్లాడుతూ...పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందని.. ప్రొఫెషనల్‌గా ఆడకపోవడం వల్లనే తమ జట్టు ఓడిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యేసరికి మీడియా ప్రతినిధులు ఆమెను ఓదార్చారు..

అనంతరం లారా సమావేశాన్ని కొనసాగించారు. మరోవైపు గ్రూప్-బిలో తన తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్ గురువారం భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సెమీస్‌కు వెళుతుంది. ఆస్ట్రేలియా తన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే సెమీస్‌కు చేరింది. 
 

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

భారతీయ క్రీడాకారుడి ఆత్మహత్య....అకాడమీ హాస్టల్లోనే ఉరేసుకుని

కాశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

ఆసిస్ బౌలర్ కి అరుదైన జబ్బు.. ఆటకు గుడ్ బై

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

రోహిత్ శర్మను అధిగమించిన ధావన్... కోహ్లీ తర్వాత అతడే

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌‌పై భారత్ ఘన విజయం

సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించడం అసాధ్యం: సెహ్వాగ్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ