భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పై స్టార్ బ్యట్స్ వుమెన్ మిథాలీ రాజ్.. మేనేజర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. కాగా.. ఈ మ్యాచ్ లో మిథాలీ రాజ్ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే కామెంట్స్ వినిపించాయి.

దీనిపై హర్మన్ ప్రీత్ కూడా స్పందించింది. మిథాలీని తీసుకోకపోవడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్ కూడా లేవని చెప్పింది. కాగా.. ఈ విషయంపై మిథాలి స్పందించకపోయినప్పటికీ.. ఆమె మేనేజర్ అనీషా గుప్త మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘దురదృష్టవశాత్తూ భారత మహిళ జట్టు ఆట కంటే రాజకీయాల్నే నమ్ముకుంటుంది. మిథాలీ అనుభవం జట్టుకు ఎంత మేలు చేస్తుందో ఐర్లాండ్‌ మ్యాచ్‌లో చూశాక కూడా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? కుట్రపూరితంగా వ్యవహరించే, అబద్ధాలు చెప్పే, పరిణతి లేని, కెప్టెన్‌గా ఉండటానికి అర్హత లేని హర్మన్‌ను మెప్పించడానికి ఇంకేం చేయాలి? మిథాలీ నిలకడగా ఆడుతున్నప్పటికీ ఆమెతో ఇలా వ్యవహరించడం దారుణం. దీన్ని బట్టి పైకి మాట్లాడుతున్న దాంతో పోలిస్తే.. తెర వెనుక ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. యువ క్రికెటర్లకు అవకాశమివ్వడానికి జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలైన క్రీడాకారిణిని తప్పించాలా?’’ అంటూ మిథాలి మేనేజర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

కాగా.. మిథాలి మేనేజర్ అనీషా గుప్త చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. 

read more news

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

మ్యాచ్ ఓడిపోయినందుకు.. ప్రెస్‌మీట్‌లోనే ఏడ్చేసిన ఐర్లాండ్ కెప్టెన్

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

చెలరేగిన విండీస్ బౌలర్లు...కేవలం 46 పరుగులకే ఆలౌట్

మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌‌పై భారత్ ఘన విజయం