అంటిగ్వా: ఇంగ్లాండుతో జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తుది జట్టులోకి మిథాలీ రాజ్ ను తీసుకోకపోవడంపై భారత కెప్టెన్ హర్మాన్ ప్రీత్ స్పందించారు. మిథాలీ రాజ్ ను పక్కన పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే, మిథాలీ రాజ్ ను పక్కన పెట్టినందుకు విచారమేమీ లేదని కౌర్ అన్నారు. 

ట్వంటీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ చరిత్రకెక్కారు. తాము తీసుకున్న నిర్ణయం జట్టు కోసమేనని కౌర్ అన్నారు. కొన్ని సార్లు అది పనిచేస్తుంది, కొన్ని సార్లు చేయదు, అందుకు విచారం లేదని అన్నారు. 

తమ జట్టు ఈ టోర్నమెంటులో ఆడిన తీరుకు గర్విస్తున్నానని, తమది యువక్రీడాకారిణుల జట్టు అని, తాము నేర్చుకునే ప్రక్రియలో ఉన్నామని అన్నారు. 

ఇంగ్లాండు జట్టు ఆట తీరును ఆమె ప్రశంసించారు. పిచ్ ను బట్టి కొన్ని సార్లు మన ఆటు తీరును మార్చుకోవాల్సి ఉంటుందని, ఇంగ్లాండు బాగా బౌలింగ్ చేసిందని, పిచ్ ను బాగా అధ్యయనం చేసిందని అన్నారు. మానసిక స్థైర్యాన్ని తమ జట్టు పెంపొందించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

సంబంధిత వార్త

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్