Asianet News TeluguAsianet News Telugu

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలనం సృష్టించారు. అంతర్జాతీయ టీ20లలో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా (పురుషులైనా, మహిళలైనా) మిథాలీ రికార్డుల్లోకి ఎక్కారు.

mithali raj breaks rohit sharma record
Author
Delhi, First Published Nov 13, 2018, 1:40 PM IST

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలనం సృష్టించారు. అంతర్జాతీయ టీ20లలో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా (పురుషులైనా, మహిళలైనా) మిథాలీ రికార్డుల్లోకి ఎక్కారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమె 47 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసింది. తద్వారా 2232 పరుగులతో టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. దీంతో పురుషుల క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధించిన 2207 పరుగుల రికార్డు బద్ధలైంది.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ ఐదో స్థానంలో ఉన్నారు.. ఆమె కంటే ముందు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌వుమెన్‌ సుజీ బేట్స్‌(2913) అగ్రస్థానంలో ఉండగా, విండీస్‌ బ్యాటర్‌ టేలర్‌(2691), ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్స్‌(2605), ఆస్ట్రేలియా క్రికెటర్ లానింగ్‌(2241) ఉన్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది.. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. తన తదుపరి మ్యాచ్‌లో భారత్ గురువారం ఐర్లాండ్‌ను ఎదుర్కొంటుంది. 

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

టెస్టు జట్టులో దక్కని చోటు: రోహిత్ శర్మ ఉద్వేగభరిత ట్వీట్

నేను ఆ స్థితిలో లేను: జట్టులో చోటుపై రోహిత్ శర్మ

ఇంటికే: రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios