మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్రకు ఇంగ్లాండ్ బ్రేకులు వేసింది. అంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది.

ఓపెనర్ స్మృతి మంథాన 34, రోడ్రిగ్స్ 26 మినహా మిగిలిన బ్యాట్స్‌మన్లంతా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ నైట్ మూడు వికెట్లు, ఎక్లేస్టన్, జోర్డాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లిద్దరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన జోన్స్ 51, నటైలి 54 జోడి దూకుడుగా ఆడుతూ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో 25న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌ తలపడనుంది.