మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ ఓడిపోవడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. గ్రూప్ దశంలో మేటి జట్లను ఓడించిన టీమిండియా..సెమీస్‌లో కనీస పోరాటాన్ని ప్రదర్శించలేదంటూ వారు టీమ్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.

మరోవైపు ఇంతటి కీలక మ్యాచ్‌కు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పక్కనబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉన్న మిథాలీని బెంచ్‌కు ఎందుకు పరిమితం చేశారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

చెత్త కెప్టెన్సీతోనే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కనీసం ఈ మ్యాచ్ ద్వారానైనా సీనియర్ల అవసరం ఏంటో తెలుసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.

మరోవైపు మిథాలీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించారు. ‘‘ వ్యూహాలు ఒక్కోసారి ఫలిస్తాయి.. మరికొన్ని సార్లు ఫెయిలవుతాయి.. దీనికి పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.

ప్రపంచకప్‌లో తమ జట్టు ఆట పట్ల గర్వపడుతున్నాను.. యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం అన్నారు...పిచ్‌ను అర్ధం చేసుకుని ఇంగ్లీష్ జట్టు బాగా ఆడిందని.. అయితే తమ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఒత్తిడిలో ఎలా ఆడాలనే దానిపై ఫోకస్ పెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్‌లను సులభంగా మావైపు తిప్పుకునే వాళ్లమని హర్మన్ ప్రీత్ అభిప్రాయపడ్డారు. 

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

మ్యాచ్ ఓడిపోయినందుకు.. ప్రెస్‌మీట్‌లోనే ఏడ్చేసిన ఐర్లాండ్ కెప్టెన్

టీ20లలో మిథాలీ రాజ్ సంచలనం.. రోహిత్ రికార్డు బద్ధలు

చెలరేగిన విండీస్ బౌలర్లు...కేవలం 46 పరుగులకే ఆలౌట్

మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌‌పై భారత్ ఘన విజయం