Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: అదృష్టం కలిసిరాక స్టీపుల్ ఛేజ్ లో ముగిసిన అవినాష్ సాబ్లే పోరాటం

ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో సరికొత్త నేషనల్ రికార్డు ని నెలకొల్పినప్పటికీ... అదృష్టం కలిసిరాక హీట్స్ నుంచి ఫైనల్స్ కి క్వాలిఫై అవలేకపోయాడు. 

Tokyo Olympics: Unlucky Indian Athlete Avinash Sable Misses out on steeplechase Finals
Author
Tokyo, First Published Jul 30, 2021, 7:09 AM IST

టోక్యో ఒలింపిక్స్ లో నేటి నుండి మొదలైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో సరికొత్త నేషనల్ రికార్డు ని నెలకొల్పినప్పటికీ... అదృష్టం కలిసిరాక హీట్స్ నుంచి ఫైనల్స్ కి క్వాలిఫై అవలేకపోయాడు. ఇండియన్ ఆర్మీలో అధికారిగా ఉన్న అవినాష్.. 8:18.12 తో తన పేరిట ఉన్న నేషనల్ రికార్డు ను బ్రేక్ చేసి 7వ స్థానంలో నిలిచాడు. 

ప్రతి హీట్ లో టాప్ 3తో పాటుగా తదుపరి 6గురు ఫస్ట్ అథ్లెట్స్ మాత్రమే ఫైనల్స్ లో తలపడనున్న నేపథ్యంలో 7వ స్థానంలో నిలిచిన అవినాష్ పోరు ఇక ముగిసినట్టే..!

అవినాష్ తన పేరిట ఉన్న 8:20.20 రికార్డు ను తిరగరాసి ఈ సరికొత్త రికార్డు ను నెలకొల్పాడు. థర్డ్ హీట్ చాలా స్లో గా ముగియడంతో అవినాష్ కన్నా ఎక్కువ సమయంలో రేస్ ని ముగించిన ముగ్గురు ఫైనల్స్ కి క్వాలిఫై అయ్యారు. ఇంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు. ఒలింపిక్స్ అంటేనే ఎక్స్ పెక్ట్ ది అన్ ఎక్స్ పెక్టడ్ అన్నట్టు... ఇది మరోసారి అవినాష్ విషయంలో నిరూపితమైంది. 

ఏది ఏమైనా... అవినాష్ అద్భుతమైన ప్రదర్శనను చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 

ఇక నేటి ఉదయం జరిగిన ఆర్చరీ ఎలిమినేషన్స్ లో భారత ఏస్ ఆర్చర్,ప్రపంచ నెంబర్ 1 దీపికా కుమారి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. మరికాసేపట్లో దీపికా కుమారి క్వార్టర్స్ లో కొరియా కి చెందిన సాన్ ఆన్ తో తలపడనుంది. 

ఉదయం జరిగిన ఎలిమినేషన్స్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా తో జరిగిన మ్యాచులో 5 సెట్లలో దీపిక రెండు సెట్లను గెలవగా... పెరోవా రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అవడంతో స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. దానితో షూట్ అవుట్ అనివార్యమయింది. 

ఆ తరువాత జరిగిన షూట్ అవుట్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా 7 పాయింటర్ల షాట్ మాత్రమే కొట్టగా... దీపిక ఎక్సలెంట్ 10 పాయింటర్ తో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. టోక్యోలో నేటి ఉదయం చిరుజల్లులు కురుస్తుండడంతో వాతావరణం ఎలా ఉంటుందో అని అంతా భయపడ్డప్పటికీ... అంతా సజావుగా సాగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios