బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేత పివి సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. భారత  దేశ  కీర్తిని విశ్వవ్యాప్తం  చేస్తున్న సింధు తెలుగమ్మాయి కావడం తెలుగు ప్రజలకుమ గర్వకారణమని అన్నారు.  తెలంగాణ రాజ్ భవన్ లో జరుగుతున్న మొదటి కార్యక్రమంలో సింధును సన్మానించడం ఆనందంగా వుందని గవర్నర్ పేర్కొన్నారు.

అలాగే బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ను కూడా గవర్నర్ అభినందించారు.  ఆయన్ని భీష్మ పితామహుడు అంటూ సంబోధించారు. అలాగే సింధు దేశ గౌరవానికి ప్రతీక అంటూ గవర్నర్ పేర్కొన్నారు. 

ఇక సింధు కెరీర్లో ఈ ఛాంపియన్‌షిప్ విజయం  ఓ బిందువు మాత్రమే అన్నారు. ఇక నుండి టోక్యో 2020 ఒలిపింక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే ఆమెకు లక్ష్యంగా వుండాలన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించేవరకు విరామం  తీసుకోకూడదని సూచించారు. ఈ గోల్డ్ మెడల్ తో మరోసారి సింధు రాజ్ భవన్ కు రావాలని కోరుకుంటున్నట్లు నరసింహన్ తెలిపారు.  

ఇక కోచ్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని గవర్నర్ అన్నారు. అతడు బ్యాడ్మింటన్ కోచ్ ఎంతో మంది అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దాడు...ఇంకా తయారుచేస్తూనే వున్నాడన్నారు. అందువల్లే అతన్ని భీష్మపితామహుడితో పోల్చినట్లు  గవర్నర్ వెల్లడించారు. అతడికి సహకరించిన మిగతా  కోచ్  లకు కూడా ఆయన అభినందించారు. 

సంబంధిత వార్తలు

నాకు డబ్బులు కాదు...సింధు వంటి ఛాంఫియన్లు కావాలి: కోచ్ కిమ్ జీ హ్యూన్

వరల్డ్ ఛాంపియన్ పివి సింధుకు ప్రత్యేక బహుమతి...ప్రకటించిన చాముండేశ్వరీనాథ్‌

అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు