ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2019లో అద్భుతమైన ఆటతీరుతో భారత క్రీడాకారిణి పివి సింధు విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని మరింత పెంచుతూ సత్తా చాటిన ఆమెపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ కు మొదటి గోల్డ్ మెడల్ అందించిన తెలుగు తేజానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ప్రత్యేక బహుమతిని అందించనున్నట్లు ప్రకటించాడు.

గోల్డ్ మెడల్ తో ఇప్పటికే డిల్లీకి చేరుకున్న సింధు మరికొద్దిసేపట్లో  హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో  చాముండేశ్వరి నాథ్ లేటెస్ట్ మోడల్ కారుని సింధుకు బహుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కారును రెడీ చేసినట్లు తెలుస్తోంది.  

పీవీ సింధుకి కేంద్ర క్రీడా శాఖ ఇప్పటికే రూ.10లక్షల నజరానా ప్రకటించింది. ఇవాళ డిల్లీలో తనను కలిసిన సింధుకు క్రీడా మంత్రి కిరణ్ రిజుజు ఈ చెక్కును కూడా అందించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు.  

స్విట్జర్లాండ్ లోని బోసెల్ లో ఆదివారం జరిగిన ఫైనల్ వార్ లో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పదునైన స్మాష్ లు, డ్రాప్ షాట్లతో విరుచుకుపడుతూ తన ప్రత్యర్థి ఒకుహురాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు వరస సెట్లలో 21-7, 21-7 తో విజయభేరి మోగించింది. ఇలా వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సింధు  ఐదో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే గత రెండు పర్యాయాలుగా అందకుండా మిస్సవుతున్న బంగారు పతకాన్ని కూడా ఈసారి  గెలుచుకుని సింధు సత్తా చాటింది.  

సంబంధిత వార్తలు

అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు