బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019 విజేతగా తెలుగుతేజం పివి సింధు నిలిచింది. గత రెండు సీజన్లలో కూడా సింధు ఫైనల్ కు చేరినప్పటికి గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది. కానీ ఈసారి మరింత పట్టుదలతో ఆడి మూడోసీడ్ జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై ఫైనల్ పోరులో ఓడించింది. దీంతో ఆమె ఒక్కరి కాదు యావత్ భారత ప్రజల కల నెరవేరింది. ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు మొదటి గోల్డ్ అందించిన మొదటి షట్లర్ గా  సింధు నిలిచింది. 

ఈ సందర్భంగా గత రెండు పర్యాయాలు ఫైనల్లో ఓటమిపాలైన తాను ఎదుర్కొన్న విమర్శలన్నింటిని సింధు గుర్తుచేసుకున్నారు. అయితే వెంటనే తనను విమర్శించేవారికి సమాధానం చెప్పవచ్చు. కానీ కానీ తాను అలా చేయలేదని అన్నారు.  అలాంటివారందరికి మాటలతో కాకుండా తన ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాను. ఈ గెలుపే తనను గత రెండేళ్లుగా విమర్శిస్తూ అవమానిస్తున్న వారికి సమాధానమని సింధు ఆగ్రహంతో వెల్లడించాడు. 

''గత రెండు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లలో నేను ఫైనల్లో పోరాడినా ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో భాదలో వున్న తనను ఓదార్చకుండా కొందరు మరింత దెప్పిపొడిచేలా మాట్లాడారు. ఈ ఒక్క మ్యాచ్ ఎందుకు గెలవలేక పోయావు...? నిర్లక్ష్యంగా ఆడటం వల్లే ఓడిపోయావు..? నువ్వు చాలా  కష్టపడాలి..? అంటూ ఎవరికి  తోచినట్లు వారు సలహాలిచ్చేవారు. ఓడిన బాధలో వున్న తనను ఈ మాటలు మరింత బాధపెట్టేవి.'' అని సింధు తాను పడ్డ నరకయాతన గురించి వివరించారు. 

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది.  ఈ మ్యాచ్ ఆరంభం నుండి సింధు దూకుడుగా ఆడుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో మొదటి రౌండ్ ను 21-7 పాయింట్ల తేడాతో గెలుచుకుంది. రెండో రౌండ్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గించని సింధు సేమ్ ఫలితాన్ని రాబట్టింది. దీంతో 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థిని ఓడించి మొదటిసారి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను చేజిక్కించుకుంది. ఇలా కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్రను ముగించడం విశేషం.   

సంబంధిత వార్తలు

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు