Asianet News TeluguAsianet News Telugu

నాకు డబ్బులు కాదు...సింధు వంటి ఛాంఫియన్లు కావాలి: కోచ్ కిమ్ జీ హ్యూన్

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంఫియన్‌షిప్ లో పివి  సింధు సాధించిన గోల్డ్ మెడల్ వెనుక ఒ కొరియన్ క్రీడాకారిణి కష్టం దాగుంది. ఆమె ఎవరో మరెవరో కాదు సింధు కోచ్ కిమ్ జి హుయూన్. 

im not here to make a money...but produce a champions: pv sindhu coach kim ji hyun
Author
Hyderabad, First Published Aug 28, 2019, 4:55 PM IST

పివి సింధు... బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచి భారత దేశ గౌరవాన్ని పెంచిన తెలుగు తేజం. అయితే వరుసగా రెండుసార్లు ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమిపాలైన ఆమె ఈసారి మాత్రం విజయాన్ని ఒడిసిపట్టుకుంది. ఇలా సింధును వరల్డ్ ఛాంపియన్ గా మార్చిన క్రెడిట్ ఆమె కోచ్ కిమ్ జీ హయూన్ కు దక్కుతుంది. ఇదే అభిప్రాయాన్ని నిన్న(మంగళవారం) ప్రెస్ మీట్ లో సింధు కూడా వ్యక్తం చేశారు. తన విజయంలో కిమ్ పాత్ర చాలావుందని...ఆమెకు సింధు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 


సింధు విజయంపై కిమ్ స్పందన 

సింధు వ్యాఖ్యల తర్వాత కిమ్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంతకూ సింధు  కోచ్ గోపించందా లేక కిమ్ హయూనా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో  మొదలయ్యింది. ఈ సందేహాన్ని తాజాగా కిమ్ హయూనే స్వయంగా నివృత్తి చేశారు. 

''నేను గోపీచంద్ అకాడమీలో కోచ్ గా వ్యవహరిస్తున్నాను. యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో గోపీచంద్ బిజీగా మారడంతో సింధు, సైనా ల కోచింగ్ బాధ్యతలను నాకు అప్పగించారు. ఇలా ఇప్పటికే ఛాంపియన్లుగా వున్న వీరిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అరుదైన అవకాశం నాకు వచ్చింది. దాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానని సింధు విజయమే నిరూపించింది. 

నేను కేవలం డబ్బుల కోసమే గోపీచంద్ అకాడమీ పనిచేయడం లేదు. నాకెంతో ఇష్టమైన  బ్యాడ్మింటన్ పై ఆసక్తిగల యువతను ఛాంపియన్లుగా తయారుచేయాలని పనిచేస్తున్నా. కానీ ఇక్కడ అంతకంటే గొప్ప అవకాశం లభించింది. నా పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్న సింధు ఇలా వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో  ఆనందాన్నిచ్చింది. ఆ సమయంలో ఆకాశంలో తేలియాడుతున్నట్లు అనిపించింది.'' అని కిమ్ వెల్లడించారు. 


అసలు ఎవరీ కిమ్

కిమ్ హయూన్ మాజీ కొరియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 1994 ఆసియా  క్రీడల్లో స్వర్ణపతకం సాధించడం ద్వారా ప్రపంచానికి ఆమె పరిచయమయ్యారు. అంతేకాకుండా 1996, 2000  సంవత్సరాల్లో జరిగిన ఒలిపింక్స్ లో కోరియా తరపున ఆడారు.  ఆ తర్వాత 2001లో తన బ్యాడ్మింటన్ కెరీర్ కు వీడ్కోలు పలికారు. 

అయితే జపాన్, చైనాలను చెందిన క్రీడాకారులను ఎదుర్కోవడంలో భారత షట్లర్లు ఇబ్బందిపడుతున్నట్లు కోచ్ గోపీచంద్ పసిగట్టాడు. ఈ  సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతున్న అతడికి కిమ్ పేరు గుర్తొచ్చింది. దీంతో వెంటనే ఆమెను సంప్రదించిన తన అకాడమీలో కోచ్ గా నియమించుకున్నాడు. 

తాజాగా అటు యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు సింధు, సైనాల కోచింగ్ బాధ్యతలు చూసుకోవడం గోపీచంద్ కు భారంగా  మారిందిం. దీంతో సింధు, సైనాల కోచింగ్ బాధ్యతలను పూర్తిగా కిమ్ కు అప్పగించాడు. దీంతో ఆమె వారికి లాంగ్ ర్యాలీలు ఎలా ఆడాలి, దూకుడుగా ఆడుతే పాయింట్స్  ఎలా రాబట్టాలన్న దానిపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వీటన్నింటిని తూచ తప్పకుండా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో పాటించిన సింధు రెండు సార్లు చేజారిన స్వర్ణాన్ని హ్యాట్రిక్ ప్రయత్నంలో అందుకుంది. 

సంబంధిత వార్తలు

 వరల్డ్ ఛాంపియన్ పివి సింధుకు ప్రత్యేక బహుమతి...ప్రకటించిన చాముండేశ్వరీనాథ్‌

అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు

Follow Us:
Download App:
  • android
  • ios