Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ ఒలింపిక్స్... మిషన్ ఒలింపిక్స్ సెల్‌కి మాజీ అథ్లెట్లు అంజూ బాబీ జార్జ్, సర్దార్ సింగ్‌లతో పాటు...

మిషన్ ఒలింపిక్స్ సెల్ (MOC)లో  భారత మాజీ అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... టోక్యోలో వచ్చిన ఫలితాలతో మాజీ అథ్లెట్ల పర్యవేక్షణలో యువ అథ్లెట్లకు శిక్షణ...

Target Olympics: Indian Sports Ministry doubles former International Athletes in Mission Olympic Cell
Author
India, First Published Dec 2, 2021, 4:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా, దేశంలో క్రీడాభివృద్ధిని మరింత పెంచేందుకు అవసరమైన అడుగులు వేస్తోంది భారత యూత్ ఎఫైర్స్ అండ్ క్రీడా శాఖ మంత్రి. ఇందులో భాగంగా మిషన్ ఒలింపిక్స్ సెల్ (MOC)లో ప్రధాన సభ్యులుగా ఉన్న భారత మాజీ అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఒలింపిక్స్‌‌లో పతకాల సాధనే లక్ష్యంగా అవసరమైన మార్గనిర్దేశకాలను ఈ మిషన్ ఒలింపిక్ సెల్ చేస్తుంది. ప్రపంచ క్రీడా వేదికలపై భారత అథ్లెట్ల ప్రదర్శన ఏటికేటికీ మెరుగవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చారు. అయితే స్వర్ణ పతకాలు తెస్తారని ఆశించిన స్టార్ షూటర్లు, ఆర్చరీ అథ్లెట్లు, బాక్సర్లు మాత్రం విశ్వ వేదికపై సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు...

Read: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టుపై నీలిమేఘాలు... ముంబైలో భారీ వర్షాలు, మ్యాచ్‌పై అల్పపీడన ప్రభావం...

గత ఒలింపిక్స్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇకపై భారత జట్టు పర్ఫామెన్స్ మరింత మెరుగయ్యేందుకు వీలుగా ఈ మిషన్‌ను ప్రవేశపెట్టినట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు...

‘విశ్వవేదికలపై పోటీపడిన మాజీ అథ్లెట్ల అనుభవాలు, యువ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఎంఓసీలో మాజీ అథ్లెట్లే కీలక పాత్ర పోషిస్తారు. యువ అథ్లెట్లకు అవసరమైన ట్రైయినింగ్‌తో పాటు ప్రపంచవేదికలపై పోటీపడుతున్నట్టు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తారు. టోక్యో 2020 సీజన్‌లో ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ఒలింపిక్స్‌లో 7 పతకాలు నెగ్గిన భారత్, పారా ఒలింపిక్ గేమ్స్‌లో 19 పతకాలు సాధించింది...’ అంటూ తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

కొత్తగా మిషన్ ఒలింపిక్ సెల్‌లో మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ భాయ్‌చుంగ్ భుటియా, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లాంగ్ జంప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, హాకీ ఇండియా మాజీ కెప్టెన్ సర్ధార్ సింగ్, రైఫిల్ షూటింగ్ లెజెండ్ అంజలి భగవత్, మాజీ హాకీ కెప్టెన్,  ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈవో వీరెన్ రక్సీన్హా, టేబుల్ టెన్నిస్ స్టార్ మోనాలిసా మెహతా, బ్యాడ్మింటన్ ఏస్ ప్లేయర్ తృప్తి ముర్గుండే సభ్యులుగా ఉంటారు...

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి డైరెక్టర్ జనరల్‌గా ఉండే వ్యక్తి, మిషన్ ఒలింపిక్ సెల్‌కి ఛైర్మెన్‌గా వ్యవహరిస్తారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలియచేసింది. 


టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ 2020, పారాలింపిక్స్ 2020 పోటీల్లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తంగా 7 పతకాలు సాధించింది భారత జట్టు. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా... మహిళా హాకీ జట్టు కూడా ఏ మాత్రం అంచనాలు లేకుండా కాంస్య పతక పోరు దాకా వెళ్లింది.

భారత్‌కి స్వర్ణ పతకాలు తెస్తారని ఆశించిన అథ్లెట్లు, బాక్సర్లు, రెజర్లు నిరాశపరిచినా జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా, మీరాభాయి ఛాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించగా, రెజ్లర్ రవికుమార్ దహియా రజతం గెలిచాడు...  బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్యం గెలవగా, బాక్సర్ లవ్‌లీనా, రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్య పతకాలు సాధించారు. 

Read also: అతన్ని వదిలేది లేదు, ఎంత ఖర్చుపెట్టైనా సరే... సురేష్ రైనాపై రాబిన్ ఊతప్ప కామెంట్...

Follow Us:
Download App:
  • android
  • ios