IPL 2024: 10 బంతుల్లో 50 పరుగులు.. విల్ జాక్స్ విధ్వంసానికి క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
IPL 2024 Will Jacks : ఐపీఎల్ 2024 45వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 4 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టేడియంలో ఎవరూ ఊహించని విధంగా తుఫాను బ్యాటింగ్ తో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు విల్ జాక్స్.
Will Jacks - Chris Gayle : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 45వ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్సర్ల మోత మోగింది. ఆర్సీబీ ప్లేయర్ల దెబ్బకు అనేక రికార్డులు బద్దలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడ్డాయి. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గుజరాత్ పై విజయం సాధించింది బెంగళూరు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా తుఫాను బ్యాటింగ్ వారిని ముంచెత్తింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ విల్ జాక్వెస్ ఆర్సీబీ తరుపున 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్ తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను చిత్తుచేస్తూ కేవలం 41 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదుచేశాడు. విల్ జాక్స్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి. 243.90 స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ టైటాన్స్ (జీటీ) బౌలర్లను చిత్తు చేశాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
10 బంతుల్లో 50 పరుగులు.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
విల్ జాక్స్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు, అయితే దీని తర్వాత ఎవరూ ఊహించనిది జరిగింది. విల్ జాక్స్ తన సెంచరీ ఇన్నింగ్స్ లో కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 10 బంతుల్లోనే 10 50 పరుగుల నుంచి 100 పరుగులకు చేరుకున్నాడు. అంటే కేవలం మరో 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ ఇంతకు ముందు 13 బంతుల్లో 50 పరుగుల నుంచి 100 పరుగులకు చేరుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు క్రిస్ గేల్ రికార్డును విల్ జాక్స్ బద్దలు కొట్టాడు. ఆదివారం సాయంత్రం 6:41 గంటలకు విల్ జాక్స్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే సాయంత్రం 6:47 గంటల సమయానికి సెంచరీకి చేరుకున్నాడు. అంటే విల్ జాక్స్ 6 నిమిషాల్లో 50 పరుగుల నుంచి 100 పరుగులకు చేరుకున్నాడు.
Virat Kohli : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు..
విరాట్ కోహ్లీ కూడా దుమ్మురేపాడు..
ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 50 పరుగుల నుంచి 100 పరుగుల వరకు ప్రయాణించి అద్భుతం చేశాడు. విల్ జాక్వెస్ గురించి చెప్పాలంటే, అతను 17 బంతుల్లో 17 పరుగులతో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. దీని తర్వాత, విల్ జాక్వెస్ కేవలం 24 బంతుల్లో తదుపరి 83 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ (70 నాటౌట్)తో కలిసి విల్ జాక్వెస్ రెండో వికెట్‌కు కేవలం 74 బంతుల్లో 166 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ధోని సరికొత్త రికార్డు.. ఈ చారిత్రాత్మక మైలురాయిని రోహిత్, కోహ్లీలు అందుకోలేకపోయారు..
- Bangalore vs Gujarat
- Chris Gayle
- Cricket
- Faf du Plessis
- GT vs RCB
- Gujarat Titans
- Gujarat vs Bangalore
- IPL
- IPL 2024
- IPL century record
- Indian Premier League
- Indian Premier League 17th Season
- RCB
- RCB vs GT
- Royal Challengers Bangalore
- Royal Challengers Bangalore vs Gujarat Titans
- Sai Sudarshan
- Shahrukh Khan
- Shubman Gill
- Tata IPL
- Tata IPL 2024
- Team India
- Virat Kohli
- Will Jacks
- half-century record
- sports