Asianet News TeluguAsianet News Telugu

‘‘ఎవడికి కావాలి మీ ముష్టి’’: క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ గావస్కర్

సిరీస్ ట్రోఫీ బహుకరణ సందర్భంగా టోర్నీతో పాటు చివరి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇచ్చే ప్రైజ్‌మనీ తక్కువగా ఉండటం గావస్కర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. 

sunila gavaskar fires on Cricket Australia
Author
Sydney NSW, First Published Jan 19, 2019, 10:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

క్రికెట్ ఆస్ట్రేలియాపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ట్రోఫీ బహుకరణ సందర్భంగా టోర్నీతో పాటు చివరి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇచ్చే ప్రైజ్‌మనీ తక్కువగా ఉండటం గావస్కర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.

ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు అర్థసెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’గా, మెల్‌బోర్న్ వన్డేలో ఆరు వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ చాహాల్‌ను ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’’గా ఎంపిక చేసిన సీఏ వారిద్దరికి ట్రోఫీలతోపాటు నగదు బహుమతిని అందజేసింది.

నిర్వాహకులు మరి దారుణంగా 500 అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో రూ.35 వేలు) ఇవ్వడంపై సన్నీ గుస్సా అయ్యాడు. ‘‘ టీమిండియా ఆటగాళ్లకు ముష్టి వేసినట్లు 35 వేలు బహుమతిగా ఇచ్చి అవమానిస్తారా...? అని నిలదీశారు.

ఆటగాళ్ల వల్లనే స్పాన్సర్స్ వస్తారు.. వారి వల్లనే బోర్డులకు డబ్బులు వస్తాయి.. ఒక్కసారి వింబుల్డన్‌లో టెన్నిస్ క్రీడాకారులకు ఇచ్చే క్యాష్ ప్రైజ్‌ని చూడండి అంటూ చురకలు అంటించాడు. ఆటగాళ్ల వల్లనే క్రీడల్లో డబ్బుల వర్షం కురుస్తోంది.

వారిని గౌరవించుకునేలా క్యాష్ రివార్డ్స్ ఇవ్వండి అంటూ గావస్కర్ మండిపడ్డారు. సిరీస్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల పేరిట చాలా సొమ్ము చేసుకున్నారు. అయినా భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే ఇచ్చారు.. కనీసం ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్

Follow Us:
Download App:
  • android
  • ios