MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • IND vs NZ : 2024, 2026 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సేమ్ అంపైర్.. మరి రిజల్ట్ కూడా సేమేనా..? ఇంతకూ ఎవరతను..?

IND vs NZ : 2024, 2026 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సేమ్ అంపైర్.. మరి రిజల్ట్ కూడా సేమేనా..? ఇంతకూ ఎవరతను..?

T20 World Cup 2026 Final : రేపు (ఆదివారం) జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు అంపైర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ పైనల్లో అంపైరింగ్ చేసిన వ్యక్తే 2026 లోనూ చేయనున్నాడు.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 07 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కు వీళ్లే అంపైర్లు..
Image Credit : X/ICC

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు వీళ్లే అంపైర్లు..

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య హైవోల్టేజ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు అంపైర్లుగా ఎవరు వ్యవహరిస్తారనే ఉత్కంఠకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెరదించింది. ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం... ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీమిండియాకు ఇల్లింగ్‌వర్త్‌ సెంటిమెంట్..
Image Credit : Twitter

టీమిండియాకు ఇల్లింగ్‌వర్త్‌ సెంటిమెంట్..

రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు ఇది వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్. గతంలో బార్బడోస్‌లో జరిగిన ఇండియా-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈయనే అంపైర్‌గా ఉన్నారు. అంతేకాదు 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోనూ ఇల్లింగ్‌వర్త్ అంపైరింగ్ చేశారు. దీంతో టీ20 వరల్డ్ కప్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని... ఇల్లింగ్ వర్త్ అంపైరింగ్ లో టీమిండియా మరో విజయం సాధిస్తుందని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Related image1
IND vs NZ : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ ఎలా సాగనుంది..?
Related image2
T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
35
బెస్ట్ అంపైర్ గా ఇల్లింగ్‌వర్త్‌ రికార్డు...
Image Credit : Getty

బెస్ట్ అంపైర్ గా ఇల్లింగ్‌వర్త్‌ రికార్డు...

మైదానంలో ఆటగాళ్ల ప్రతి మూమెంట్ ని పరిశీలిస్తూ ఖచ్చితమైన నిర్ణయాలు ఇవ్వడంలో ఇల్లింగ్‌వర్త్‌ దిట్ట. అందుకే అతడిని ఐసిసి ఏకంగా నాలుగుసార్లు బెస్ట్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికచేసింది. 2019 లో మొదటిసారి ఎంపికైన అతడు 2022,2023,2024 వరుసగా బెస్ట్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. ఇలా ఎలైట్ ప్యానెల్‌లో నాలుగుసార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక అంపైర్ ఇతడు. గతంలో దిగ్గజ అంపైర్ సైమన్ టౌఫెల్ వరుసగా ఐదుసార్లు బెస్ట్ అంపైర్ గా నిలిచారు.

45
ఎవరీ అలెక్స్ వార్ఫ్‌..?
Image Credit : AFP

ఎవరీ అలెక్స్ వార్ఫ్‌..?

మరో అంపైర్ అలెక్స్ వార్ఫ్‌కు ఇది తొలి వరల్డ్ కప్ ఫైనల్. వార్ఫ్ గతంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆటగాడిగా కూడా ఆడారు. ఇతడికి 2022 మహిళల వన్డే వరల్డ్ కప్, 2023 పురుషుల వన్డే వరల్డ్ కప్‌లలో మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. విశేషం ఏంటంటే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా తొలి సెమీఫైనల్ మ్యాచ్‌ను కూడా వీళ్లిద్దరే నిర్వహించారు. 

ఇక అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ కు దక్షిణాఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్ మూడో అంపైర్‌గా, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా బాధ్యత తీసుకోనున్నారు.

55
అహ్మదాబాద్ స్టేడియంలో సందడి...
Image Credit : X

అహ్మదాబాద్ స్టేడియంలో సందడి...

ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్ స్టేడియంలో గ్రాండ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రముఖ సింగర్ రికీ మార్టిన్ తన పాటలతో స్టేజ్‌పై సందడి చేయనున్నారు. సుమారు లక్ష మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, కోట్లాదిమంది పరోక్షంగా చూడనున్నారు. ఆయనతో పాటు 'దాండియా క్వీన్' ఫల్గుణి పాఠక్, బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, 6:30 గంటలకు టాస్ వేస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
IND vs NZ : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఇదే.. ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ ఎలా సాగనుంది..?
Recommended image2
T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved