స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు మరికొద్ది రోజుల్లో వివాహ బంధంతో  ఒక్కటవ్వనున్న సంగతి తెలిసిందే.  అయితే.. వీరు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చించి.. భారీగా వివాహం చేసుకోవడం లేదట. సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కశ్యప్ వెల్లడించారు.

డిసెంబర్ 13వ తేదీన ఉపనయనంతో పెళ్లి కార్యక్రమం మొదలౌతుందని కశ్యప్ వివరించారు. డిసెంబర్ 14వ తేదీన తమ కుటుంబసబ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం డిసెంబర్ 16వ తేదీన నోవాటెల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇప్పటికే పలువురు ప్రముఖులను సైనా, కశ్యప్ లు స్వయంగా వెళ్లి తమ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను వారికి అందించి ఆహ్వానించారు.  మొదట తాము కూడా గ్రాండ్ గానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. కానీ అంత సమయం తమకు లేదని అందుకే ఇలా ప్లాన్ చేశామని కశ్యప్ వివరించారు. తమ మొదటి ప్రాధాన్యత బ్యాడ్మింటన్ కేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు..

కేటీఆర్ ని పెళ్లికి ఆహ్వానించిన సైనా, కశ్యప్

సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ వెడ్డింగ్ కార్డ్

పెళ్లికి ఆ ఒక్క రోజే ఖాళీ దొరికింది.. సైనా నెహ్వాల్

పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా, కశ్యప్.. ముహూర్తం ఖరారు