ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివరలో ఈ ఇద్దరు వివాహం అవ్వనున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల పెద్దలు డేట్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సన్నిహితుల వివరాల ప్రకారం.. డిసెంబర్ 16న వీరి వివాహం .. 21న రిసెప్షన్ జరగనుంది. అలాగే పెళ్లి కేవలం వంద మంది సమక్షంలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరు హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో 2005లో కలిశారు. కొన్ని సంవత్సరాలకు వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. అప్పటినుంచి దాదాపు పది సంవత్సరాలుగా ఈ ఇద్దరు ప్రేమలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఈ ఇద్దరు కెమెరాలకు చిక్కినప్పటికీ.. తమ మధ్య బంధాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడిపెట్టి ఒక్కటవ్వనున్నారు.