ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కి బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా.. వీరిద్దరూ డిసెంబర్ 16వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా.. ఇప్పుడు వీరి పెళ్లి వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మాదాపూర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వీరి వివాహం జరగనుంది.

2005 నుంచి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో సైనా, కశ్యప్ ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నప్పటికీ.. కెరిర్ కోసం వీరు ఇంతకాలం పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని సైనా నే స్వయంగా మీడియాతో వివరించారు.

వారి ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం రాకుండానే..వారే అర్థం చేసుకొని వివాహానికి ఏర్పాట్లు చేశారని  సైనా ఒకానొక సందర్భంలో తెలిపారు. 

read more news

పెళ్లికి ఆ ఒక్క రోజే ఖాళీ దొరికింది.. సైనా నెహ్వాల్

పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా, కశ్యప్.. ముహూర్తం ఖరారు