తెలంగాణ మంత్రి కేటీఆర్ కి పెండ్లి పిలుపు అందింది.  స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు తమ వివాహానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు. శుభలేఖను కూడా అందజేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకుంది సైనా నెహ్వాల్.

 ‘‘కేటీఆర్ గారికి థాంక్స్. మిమ్మల్ని కలవడం, క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం చాలా ఆనందం కలిగించింది. వివాహ వేడుకలో మళ్లీ కలుద్దాం’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది. ప్రేమ పక్షులైన సైనా, కశ్యప్‌ల వివాహం ఈ నెల 16న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులను స్వయంగా వెళ్లి సైనా, కశ్యప్ లు ఆహ్వానిస్తున్నారు.

read more news

సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ వెడ్డింగ్ కార్డ్

పెళ్లికి ఆ ఒక్క రోజే ఖాళీ దొరికింది.. సైనా నెహ్వాల్

పెళ్లి పీటలు ఎక్కనున్న సైనా, కశ్యప్.. ముహూర్తం ఖరారు