టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు.  ఇటీవల విరాట్.. ఓ క్రికెట్ అభిమానిని ‘భారత్ వదిలి వెళ్లిపో’ అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కోహ్లీ.. అలా అనడం తప్పు అంటూ చాలా మంది నెటిజన్లు, పలువురు క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు. 

దీనిపై మహ్మద్ కైఫ్ తాజాగా స్పందించాడు. కోహ్లీ ట్రోల్ చేయడంలో అర్థం లేదని, అసలు కోహ్లీ అన్నదాంట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఎవరి ఎజెండా ప్రకారం వాళ్లు ప్రకటనలను ఎలా మార్చుకుంటారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. గతంలో కోహ్లీ కూడా విదేశీ క్రీడాకారులను మెచ్చుకున్నారు. కానీ.. ఇక్కడ అతను వేరే ఉద్దేశంతో కామెంట్ చేశాడు. కావాలనే కొంత మంది దీనిని పెద్దది చేసి కోహ్లీని ట్రోల్ చేస్తున్నారని కైఫ్ అభిప్రాయపడ్డారు.

కాగా.. ఇటీవల కోహ్లీ తన పేరిట ఓ యాప్ ని విడుదల చేశాడు. ఆ యాప్ ద్వారా అభిమానులు పంపిన ట్వీట్లను చదివాడు. అయితే.. ఓ అభిమాని కోహ్లీని ఉద్దేశిస్తూ..‘‘ఓవర్ రేటెడ్ బ్యాట్స్ మెన్.. చూడటానికి అతని(కోహ్లీ) బ్యాటింగ్ లో ప్రత్యేకత ఏమి ఉండదు. ఈ భారతీయుల కంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ని నేను బాగా ఎంజాయ్ ఛేస్తాను’’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్ పై మండిపడ్డ కోహ్లీ.. నువ్వుభారత్ నుంచి వెళ్లిపో అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయం పెద్దది కావడంతో.. తాను ‘‘ఈ భారతీయులు’’ అన్న పదం మీద రియాక్ట్ అయ్యానని స్పష్టత నిచ్చాడు. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగకపోవడం గమనార్హం. 

more news

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

ఫ్యాన్ పై వ్యాఖ్య: చిక్కుల్లో పడిన కోహ్లీ

కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

కోహ్లీ పార్టీ ఇవ్వలేదని అలిగి ట్రైన్ ఎక్కిన రవిశాస్త్రి.. నెట్టింట మీమ్స్

అజారుద్దీన్ పై గంభీర్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....

అజారుద్దిన్ ఓ మ్యాచ్ ఫిక్సర్...అతడితో బెల్ కొట్టిస్తారా- బిసిసిఐపై గంభీర్ గరం

‘‘ఇతన్ని పుట్టించినందుకు థ్యాంక్స్ దేవుడా’’...అనుష్క ట్వీట్

అంబటి రాయుడు సంచలన నిర్ణయం

రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ