టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ని పుట్టించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతోంది ఆయన భార్య అనుష్క శర్మ. 

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ని పుట్టించినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతోంది ఆయన భార్య అనుష్క శర్మ. ఎందుకంటే.. పరుగుల రారాజు విరాట్ కోహ్లీ 30వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది అనుష్క.

 అనుష్క, విరాట్ లు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఇతన్ని పుట్టించినందుకు థ్యాంక్స్ దేవుడా’ అని అనుష్క ట్వీట్‌ చేశారు. పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం విరాట్‌, అనుష్క కలిసి విహారయాత్రకు బయలుదేరారు. గతంలో అనుష్క బర్త్‌డేను పురస్కరించుకుని విరాట్‌ రకరకాల కేక్స్ ‌తెప్పించి ఘనంగా తన భార్య పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఇప్పుడు అనుష్క కూడా తన భర్త కోసం సర్‌ప్రైజ్‌ పార్టీని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

Scroll to load tweet…

కాగా.. అనుష్క విషెస్ చెప్పిన తీరుకి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా అభిమానులకు తెగ నచ్చేశాయి. అంతే.. వారి జంటను మెచ్చుకుంటూ, కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.