లవర్ బాయ్ గా సౌత్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ ఇప్పుడు సినిమాలు చాలా నెమ్మదిగా తీస్తున్నాడు. సక్సెస్ రేట్ తగ్గడంతో రొటీన్ కి బిన్నంగా హారర్ కాన్సెప్ట్ తో వచ్చి గత ఏడాది గృహం అనే సినిమాతో హిట్టందుకున్నాడు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఈ స్టార్ హీరో తెగ బిజీ అవుతున్నాడు. 

ప్రతి విషయం గురించి తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఒక నెటిజన్ పై చేసిన వ్యాఖ్యలకు సిద్దార్థ్ ఘాటైన ట్వీట్ తో ఆన్సర్ ఇచ్చాడు. 

విరాట్ కోహ్లీ ఆటకు తగ్గ గౌరవం దగ్గిందని అయితే అతని ఆట తనకు అంత గొప్పగా ఏమి అనిపించదని ఇంకా మన ఇండియన్ బ్యాట్స్ మేన్స్ కంటే ఇతర దేశాల ఆటగాళ్లు బాగా ఆడతారని ఒక నెటిజన్స్ కామెంట్ చేశాడు. 

అందుకు సమాధానంగా విరాట్ అతన్ని ఈ దేశంలో ఉండకు అని. ఇతర దేశాలవారిని ప్రేమించే నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించడంతో ఒక్కసారిగా ట్వీట్ వైరల్ అయ్యింది. ఇక ఈ కాన్వర్సేషన్ పై సిద్దార్థ్  ట్వీట్ చేశాడు. 

కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఒకసారి మీరు చేసిన కామెంట్స్ గురించి మళ్ళీ ఆలోచించండని భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు ద్రావిడ్ చెప్పిన మాటలను గుర్తుచేసుకోవాలని అన్నాడు. అంతే కాకుండా ఇండియా కెప్టెన్ ఇలాంటి చెత్త కామెంట్స్ చేయడమేంటనీ సిద్దార్థ్  ఘాటుగా స్పందించాడు.