వచ్చే ఏడాది ప్రపంచ దేశాల మధ్య వరల్డ్ కప్ సమరం మొదలవనుంది. అందుకోసం టీంఇండియాను ఇప్పటినుండే సన్నద్దమవుతోంది. బిసిసిఐ కూడా ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు దూరమవకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జరిగిన ఓ సమావేశంలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సంచలన సూచనను బిసిసిఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచాడు.

టీమిండియా తరపున ప్రపంచ కప్ లో బరిలో దిగే అవకాశం వున్న ఫేస్ బౌలర్లను ఐపిఎల్ నుండి తప్పించాలని కోహ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీఓఏ సమావేశంలో కోహ్లీ ఈ ప్రతిపాదనను సీఓఎ ముందుంచాడు. వచ్చే ఏడాది మార్చి 29 నుండి మే 19 వరకు ఐపిఎల్ జరగనుండగా తర్వాత 15 రోజుల  వ్యవధిలోనే( జూన్ 5 నుండి) వరల్డ్ కప్ మొదలవనుంది. దీంతో ఐపిఎల్ వల్ల పాస్ట్ బౌలర్లు గాయాలపాలై ప్రపంచకప్ కు దూరం కాకుండా ఉండడానికే కోహ్లీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సమావేశంలోనే కోహ్లీ ప్రతిపాదనను వైస్ కెప్టెన్ రోహిత్ విభేదించినట్లు సమాచారం. ఐపిఎల్ లో ముంబై ఇండియా తరపున కెప్టెన్ గా వ్యవహరించే తాను బుమ్రా వంటి బౌలర్ ను వదులుకోడానికి సిద్దపడనని తెలిపాడు. అతడిని దూరం పెట్టడం వల్ల మంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ పరంగా వీక్  అవుతుంది కాబట్టి అందుకు రోహిత్ వ్యతిరేకించి ఉండవచ్చని ఓ అధికారి వెల్లడించారు.