టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి ని నెటిజన్లు వీపరీతంగా ఆడుకుంటున్నారు. ఆయనపై రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నెటిజన్లు ఇంత సడెన్ గా రవిశాస్త్రిని ఎందుకు టార్గెట్ చేశారనేగా మీ డౌట్.. ఇంకెందుకు ఆలస్యం  చదివేయండి..
 
అచ్చం  టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి లా ఉండే వ్యక్తి ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ కనిపించాడు. ఇంకేముంది కొందరు ఔత్సాహికులు ఆయన ఫోటీ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది. రవిశాస్త్రిలాగా ఉన్న ఈ వ్యక్తి పేరు వర్మ.. ఊరు ముంబై. సబర్బన్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటో ఇది. 

 

ఈ ఫోటోతో  ఫన్నీ మెమ్స్‌, ట్రోల్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు.  రవిశాస్త్రి అసలు ఫోటోని, అతని డూప్ ఫోటోని పక్కపక్కనే పెట్టి.. ఒకటి 2019 వరల్డ్ కప్ ముందు ఫోటో అని ఇంకోటి  2019 ప్రపంచకప్‌ తర్వాత  అంటూ కొందరు కామెంట్  చేస్తున్నారు. ఇంకొకరేమో  బీసీసీఐ ట్రావెల్‌ అలవెన్స్‌లు ఇవ్వలేదని.. అందుకే లోకల్ ట్రైన్ లో వెళ్తున్నాడని కామెంట్స్ చేశారు.  మరొకనరు.. రోహిత్‌ మొత్తం కెప్టెన్‌ అయితే ఆయన పరిస్థితిదేనని కామెంట్‌ చేస్తున్నారు. కోహ్లి డ్రింక్స్‌ పార్టీకి శాస్త్రిని పిలవలేదని, అందుకే అలిగి ట్రైన్‌ వెళ్లిపోయాడని కూడా సెటైర్లేస్తున్నారు.