టీం ఇండియా సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గంట మోగించడంపై ఢిల్లీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. అజహర్ పై గంభీర్ చేసిన ఆరోపణలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. 

‘గంభీర్‌ అసలు ఏమైంది నీకు.. మీరంటే ఎంతో గౌరవం కానీ మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయనుకోలేదు’  అని, హైకోర్ట్‌ అతని నిషేధంపై క్లీన్‌చీట్‌ ఇచ్చిన విషయం తెలియదా? అని.. అతను ఎంపీ కూడా అయ్యారని మరొకరు కామెంట్‌ చేశారు. ముందు సీనియర్‌ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమ్మని, నార్త్‌ క్రికెటర్లను ఒకలా.. సౌత్‌ క్రికెటర్లను ఒకలా చూడటం మానేయాలని హితవు పలుకుతున్నారు.

భారత్‌ తరపున 99 టెస్ట్‌లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్‌పై 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ జీవితకాల నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్‌ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్‌ క్రికెట్‌ తరహా అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 

తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదం ఎత్తివేతపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్‌-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు.

అలా అజహర్ గంట మోగించినడాన్ని తప్పుబడుతూ గంభీర్ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

read more news

అజారుద్దిన్ ఓ మ్యాచ్ ఫిక్సర్...అతడితో బెల్ కొట్టిస్తారా- బిసిసిఐపై గంభీర్ గరం