టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును స్టార్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ సమం చేశాడు.  దక్షిణాఫ్రికాతో బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ బ్యాటింగ్ కి దిగుతూనే తన పేరిట మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు 98 టీ20లు ఆడిన ధోనీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఇండియన్‌‌గా రికార్డులకెక్కగా, సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా రోహిత్ ఆ రికార్డును సమం చేశాడు. 98 టీ20లు ఆడిన ధోనీ మొత్తం 1,617 పరుగులు చేశాడు. కాగా, ధోనీ, రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో 78 టీ20లతో సురేశ్ రైనా ఉన్నాడు.

గతంలోనూ ధోని పలు రికార్డులను రోహిత్ శర్మ సమం చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోనీ సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ధోనీ 337 వన్డేల్లో 222 సిక్స్ లు బాదాడు. ఏడు సిక్స్ లు ఏషియా ఎలెవన్ తరఫున ఆడుతూ కొట్టాడు. ఆ రకంగా ధోనీ ఖాతాలో 225 సిక్స్ లు ఉన్నాయి. ఆ రికార్డును న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సమం చేశాడు.